మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 7 : కుష్టువ్యాధి నిర్మూలనకు వైద్యసిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర అదనపు సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. కుష్టువ్యాధి నిర్మూలనపై డీఎంహెచ్వో కార్యాలయంలో నోడల్పర్సన్లకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆరునెలలకోసారి ఆశ కార్యకర్తలు ఇంటింటికెళ్లి స్పర్శలేని మచ్చలను గుర్తించాలని సూచించారు. ఎవరికైనా స్పర్శలేని మచ్చలు ఉం టే నోడల్పర్సన్స్ ద్వారా డీపీఎంవోలు, వైద్యాధికారికి తె లియజేయాలని సూచించారు.
కేసు నిర్ధారణ అయితే ఎంబీ కేసులు, పీబీ కేసులుగా విభజించి చికిత్స అందించాలని తెలిపారు. కేసును గుర్తించిన గ్రామాల్లో మరోసా రి సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు. బాధితులకు వ్యాధి తీవ్రత మేరకు స్లిపర్స్ ఇవ్వడం, సర్జరీ చే యించడం లేదా రిహాబిలిటేషన్ సెంటర్కు పంపనున్న ట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో కృష్ణ, అడిషనల్ డీఎంహెచ్వో సరస్వతి, వైద్యులు జరీనాబేగం, భాస్కర్నాయక్, డెమో అధికారి తిరుపతిరావు ఉన్నారు.