లింగాల : విద్యార్థుల్లో ( Students ) దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేయాలని సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి ( Hanmanth Reddy ) కోరారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులను ( Summer Camp ) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవిలో సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణను అలవర్చుకొని చదువుతోపాటు , కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
డాన్స్, ఇండోర్ గేమ్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ,ఆర్ట్ క్రాఫ్ట్స్, జీవన నైపుణ్యాలలో మేలుకువలు ఎంతో అవసరం అన్నారు. ప్రతి విద్యార్థిలో అనేక నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికి తీసినప్పుడే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని అన్నారు. వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని విద్యార్థులను కోరారు . ఈ కార్యక్రమంలో ట్యూటర్స్ అబ్దుల్లా ,శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.