రాజోళి, ఫిబ్రవరి 16: నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పేర్కొన్నారు. రాజోళి మండల కేంద్రంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణంలో భాగంగా 690 మీటర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గత ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో గ్రామాలకు ప్రత్యేక నిధులను కేటాయిస్త్తూ గ్రామాల రూపురేఖలు మార్చారని, అదేవిధంగా నియోజకవర్గంలోని గ్రామాలకు ప్రభుత్వంతో నిధులను మంజూరు చేయిస్తూ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. గ్రామాల్లో కార్యకర్తల కు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, కిరణ్‌రెడ్డి, ఎంపీటీసీ షాషావలీ, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, షాలు, మల్దకల్, వెంకటేశ్, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, గౌరోజి, కృ ష్ణారెడ్డి, హంపయ్య, ఈరన్న పాల్గొన్నారు.