ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు.
- అపాయింట్మెంట్ ఇచ్చే ఉన్నత స్థాయికి చేరుకోవాలి
- లక్ష్యం దిశగా అడుగులేయాలి
- కేఎల్ యూనివర్సిటీలో ఒకేసారి రెండు కోర్సులు చదివే అవకాశం
- కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ గీత
- నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2024’
- ఇంటర్ తర్వాత విద్యావకాశాలపై పాలమూరు వాగ్దేవి కళాశాల విద్యార్థులకు అవగాహన
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 17 : ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. శనివారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట జిల్లా కేంద్రంలోని క్రౌ న్ గార్డెన్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు 400లకు పైగా హాజరవగా ప్రొఫెసర్ ప్రశాంత్ వారినుద్దేశించి మాట్లాడారు. ఎదగాలనే సంకల్పం బ లంగా ఉన్నవారిని ఎవరూ ఆపలేరన్నారు. మీ లక్ష్యానికి కేఎల్ యూ నివర్సిటీ గైడ్ తోడైతే గమ్యం మరింత సులువవుతుందని తెలిపారు. భూమిలో వేసిన విత్తనాన్ని నాశనం చేసేందుకు పురుగులు, కీటకాలు ప్రయత్నిస్తుంటాయని, వాటినన్నింటినీ అధిగమించి మొ క్కగా ఎదుగుతుందన్నారు.
దానికి కూడా మేకలు, గొర్రెలు తింటూ అడ్డుపడుతుంటాయని.. అయినప్పటికీ ఆటంకాల ను తొలగించుకొని మహావృక్షంగా అవతరిస్తుందన్నారు. అలా మనం కూడా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరికీ తెలివితేటలు ఉంటాయి.. వాటిని వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మెరిట్ విద్యార్థుల కు తమ యూనివర్సిటీ రూ. 100 కోట్ల స్కాలర్షిప్లు అందిస్తూ తోడ్పాటును అందిస్తుందని చె ప్పారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ (బీ.టెక్) చదివే విద్యార్థులు ఒకేసారి రెండు కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు.

College Students
బీటెక్ చదువుతున్నప్పుడే వారి స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకొని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుందని వివరించారు. రూ.60లక్షల వార్షిక ప్యాకేజీతో విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. దేశ విదేశాల్లోనూ కేఎల్ యూనివర్సిటీకి 70 నుంచి 80 విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఉందని, వారితో సంప్రదింపులు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. న్యాక్ గుర్తింపులో నాలుగు మార్కులకు గానూ కేఎల్ యూనివర్సిటీకి 3.86 మార్కులు వచ్చాయన్నారు.
మైక్రోసాఫ్ట్, విప్రోతోపాటు పలు పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక సిలబస్‌తో కూడిన పుస్తకాలను సంబంధిత అధికారుల సమక్షంలో తయారు చేస్తారని వివరించారు. 1983లో ఆరంభమైన కేఎల్ యూనివర్సిటీ 40 ఏండ్లుగా వేలాదిమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించిందన్నారు. విద్యార్థులకు యూనివర్సిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి జీవితానికి భరోసానిస్తుందన్నారు. అనంతరం ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు సా ధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంటర్ తరువాత ఎటు వైపు? అనే అంశంతో అవగాహన సదస్సును ఏ ర్పాటు చేయడంతో వాగ్దేవి విద్యార్థులు నమస్తే తెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి, యాం కర్ ఆదిత్య, కేఎల్ యూనివర్సిటీ మేనేజర్లు వెంకటేశ్, నరేశ్, దిలీప్, నమస్తే తెలంగాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ తర్వాత ఏం చదవాలో తెలుసుకున్నా..
ఈ సదస్సులో ఇంటర్ తరువాత ఏం చదవాలో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే అంశాన్ని ప్రొఫెసర్లు చాలా చక్కగా వివరించారు. ఏ కోర్సు చేస్తే మంచిగా ఉంటుంది.. అనే విషయాలపై స్పష్టత వచ్చింది. అత్యధిక ప్యాకేజీ ఇచ్చే కంపెనీల్లో స్థానాన్ని దక్కించుకునేందు కు విద్యార్థులకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయి.
ఇదో చక్కటి అవకాశం..
కేఎల్ యూనివర్సిటీ, ప్రముఖ దినపత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ సదస్సు చాలా ఉపయోగకరమైనది. ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇంటర్ తరువాత ఏం చదవాలో మాకు అవగాహన వచ్చింది. మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చదవాలి, చదివిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశాలను స్పష్టంగా గైడ్స్ తెలిపారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇదో చక్కటి అవకాశం.
– ఇ.జగదీశ్, ఇంటర్ సెకండియర్
లక్ష్య సాధనకు మార్గం దొరికింది..
నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ అవగాహన సదస్సు ద్వా రా చక్కటి మార్గం దొరికింది. ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలనే అంశాన్ని చక్కగా వివరించారు. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాల పై అవగాహన కల్పించారు. ఇంజినీరింగ్ విద్యపై ప్రశాం త్ సార్ చాలా గొప్పగా వివరించారు. ఇలాంటి యూనివర్సిటీలో చదివితే మా భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందనిపించింది. గీత మేడం కూడా బీ-ఫార్మసీ గురించి చాలా చక్కగా వివరించారు. చదివిన తరువాత ఎలాంటి ప్యాకేజీలు వస్తాయనే విషయాలు తెలుసుకున్నాం.
– లహరిక, ఇంటర్ సెకండియర్
భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకోవాలో తెలిసింది..
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అవగాహన సదస్సు చాలా మంచిగా ఉంది. ఈ సదస్సులో గైడ్స్ ఇంటర్మీడియెట్ తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలనే విషయంపై చక్కని అవగాహన కల్పించారు. నా లక్ష్యానికి ఈ అవగాహన సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీలో చోటు దక్కించుకొని చదవాలని ఉంది. చదివిన తరువాత భవిష్యత్తులో ఎలాంటి ప్యాకేజీలు వస్తాయనే వివరాలను చక్కగా వివరించారు. ఈ సదస్సు మాకు ఎంతో ఉపయోగకరమైనది.
– నిఖిత, ఇంటర్ సెకండియర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

