విజ్ఞతతో ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నది. అంత టి ప్రాధాన్యత కలిగిన చదువును కొందరు వ్యాపారంగా మలుచుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యతో దందా చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ను తుంగలో తొక్కి హంగులు ఆర్భాటాలతో ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేయడమే కాకుండా నోట్ బుక్కు లు, పాఠ్యపుస్తకాలు, డ్రస్సులను సైతం పాఠశాలల్లోనే విక్రయిస్తూ వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పవిత్రమైన విద్యాలయాలు ధనార్జన కేంద్రాలు గా మారాయి. కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు వేలకువేలు ఫీజులు దండు కోవడమే కా కుండా నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలల్లోనే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుకులు విక్రయించడంతోపాటు అర్హత లేని వారితో వి ద్యాబోధన చేయిస్తున్నారు. ఒక వైపు బడి బాట పేరుతో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందు కు ప్రయత్నిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారు లు, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంత త తంగం జరుగుతున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ధనార్జనే ధ్యేయంగా నిర్ణీత ఫీజులకు మిం చి వేలకు వేల ఫీజులను ముకు పిండి వ సూలు చేస్తున్నారు. ప్రభుత్వ బడులకంటే ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని భావిస్తున్న తల్లిదండ్రులు తమపిల్లల భవిష్యత్తు ముఖ్యమని స్థాయికి మించి ఎకువ మొత్తంలో ఫీజులు చె ల్లించేందుకు కూడా వెనకాడడం లేదు. ఇదే అదునుగా భావించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు దొరికిందే త డువు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనే ల క్ష్యంతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తమ పాఠశాలలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏకంగా నో అడ్మిషన్ బోర్డులు పెట్టి మరీ లోలోపల డొనేషన్లను వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుకులు విక్రయించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ తమకు వర్తించవన్నట్లుగా నిబంధనలకు పాతరేస్తూ పాఠశాలలోనే దుకాణాలు తెరిచేస్తున్నారు. పాఠశాలల్లో నోట్ బుకులు విక్రయించడం వల్ల తమ ఉపాధికి గండిపడుతుందని నారాయణపేటకు చెందిన పలువురు బుక్ సెంటర్ల నిర్వాహకులు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో నోట్ బు కులు, పాఠ్య పుస్తకాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఏకంగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారంటే వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుందో ఇట్టే అర్థమవుతుంది.
మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు అయితే ఒక అడుగు ముం దుకేసి తమ పాఠశాలల్లో ఐఐటీ, టెక్నో, ఒలంపీయాడ్, నీట్ వంటి వాటికి ప్రత్యేక తరగతులు చెబుతామంటూ కార్పొరేట్ హంగులతో లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో మా త్రం ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నట్లుగా చెబుతూ తరగతులు ప్రారంభమైన తర్వాత బోధించే అర్హత లేని ఇంటర్మీడియట్, డిగ్రీ ఫెయిలైన నిరుద్యోగులను విద్యాబోధనకు పెట్టుకుంటున్నారు. అర్హత కలిగిన వారిని నియమించుకుంటే ఎకువ మొత్తంలో వేతనం ఇవ్వాల్సి వస్తుందని, తకువ మొత్తంలో వేతనాలకు పనిచేసే వారిని నియమించుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, పుస్తకాలు విక్రయించరాదనే నిబంధనలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పకనపెట్టి ఒకో పాఠశాల యాజమాన్యం ఒకో బట్టల దుకాణం వ్యాపారితో ఒప్పందం చేసుకొని వేల రూపాయలను దుస్తుల కోసం వసూలు చేస్తున్నారు. ఇక పాఠ్యపుస్తకాలు, నోట్ బుకులను తమ పాఠశాలల పేర్లతో ముద్రించి పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. వీటికి తోడు అధిక మొత్తంలో రవాణా చార్జీలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫా మ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పలు పాఠశాల ల్లో నో అడ్మిషన్ బో ర్డుల పేరుతో డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పాఠశాలలను తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించాం.