దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. కానీ, ఎక్కడా లేని విధంగా కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి. ఇది అరుదైన విషయమని బ్రాహ్మణులు చెబుతున్నారు. పాండవులు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించి.., సోమేశ్వరుడితోపాటు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. 1982లో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంలో సోమశిల ముంపునకు గురికావడంతో.. లలితాసోమేశ్వరాలయాన్ని కృష్ణానది ఒడ్డున సురక్షిత ప్రాంతంలో పునర్నిర్మించారు. ఈ ఆలయ సముదాయంలోనే 12 జ్యోతిర్లింగాలకు వేర్వేరుగా మండపాలను ఏర్పాటు చేశారు. సప్తనదుల సంగమ స్థానంలో సంగమేశ్వరుడు వెలిశాడు. వేపచెట్టును లింగాకారంలో రూపొందించి ధర్మరాజు ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. కృష్ణానది నీటిమట్టం తగ్గినప్పుడు ఏటా శివరాత్రికి భక్తులు మరబోట్లలో వెళ్లి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
– కొల్లాపూర్, ఫిబ్రవరి 14
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో..
ఉమ్మడి జిల్లాలోని అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2015 ఏడాది జనవరి 15న సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌లోని స్లమ్ ఏరియాలలో నివాసం ఉంటున్న వారికి గూడు కల్పించే దిశగా పర్యటించారు. ఈ క్రమంలో పాతతోట, ఎర్రమన్నుగుట్ట వీరన్నపేట, పాతపాలమూరు ప్రాంతాలను సందర్శించారు. పూర్తిస్థాయిలో ఇండ్లులేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి 2,300 ఇండ్లను మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మొత్తం 3,550 ఇండ్లు మంజూరు చేయడంతోపాటు వీటి నిర్మాణానికి రూ.146 కోట్లు మంజూరు చేశారు. వీటిలో 2,905 ఇండ్లు పూర్తి కాగా.. మరో 453 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కేటాయించిన నిధులలో ఇప్పటి వరకు రూ.201 కోట్లు మంజూరయ్యాయి. మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిలో క్రిష్టియన్పల్లిలో 330, వీరన్నపేటలో 660, దివిటిపల్లిలో 1,024 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు.
జడ్చర్ల నియోజకవర్గంలో..
జడ్చర్ల నియోజకవర్గంలోను శరవేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. 2,700 కేటాయించడంతోపాటు వీటి నిర్మాణం కోసం రూ.143 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 1,600 ఇండ్లు ఇప్పటికే పూర్తి కాగా.. మరో 1100 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మరింత వేగంగా ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే పనిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో..
ఉమ్మడి జిల్లాలోనే దేవరకద్ర నియోజకవర్గం లో ముందుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరిగింది. నిజాలాపూర్‌లో మొదటి సారిగా 20 ఇండ్లను శరవేగం గా నిర్మించి పేదలకు మొదటి సారి అందించా రు. 1,950 ఇండ్లు నిర్మించేందుకుగానూ ప్ర భుత్వం రూ.100 కోట్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 779 ఇండ్లను పూర్తి కా గా.. 1,040 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తి చేసిన ఇండ్లకు రూ.40 కోట్లను ఖర్చు చేశారు.