గద్వాల, సెప్టెంబర్ 12 : భవిష్యత్ బీఆర్ఎస్దేనని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుంతునాయుడుతో కలిసి కేటీదొడ్డి, కొండాపు రం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన తర్వాత మొట్టమొదటి సారిగా గద్వాల నియోజకవర్గానికి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వ చ్చి సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
కేటీఆర్ పర్యటన లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుంతునాయుడు మా ట్లాడుతూ అందరం కలిసికట్టుగా పని చేసి సభను విజయవంతం చేద్దామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలంటే బీఆర్ఎస్కు మనమందరం అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాఘవేంద్రరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చక్రధర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, చక్రధర్‌రెడ్డి, మోనేశ్ భరత్‌రెడ్డి,కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.