వనపర్తి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. వనపర్తి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భగీరథ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. ఈలైన్‌కు అదనంగా పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా వద్ద ప్రత్యేక ప్లాంటేషన్ ఏర్పాటు చేసి దాదాపు 57కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ ద్వారా తాగునీరు అందించారు.
ఈ పైపులైన్ పరిధిలోనే కొన్ని వాల్వ్‌లను అప్పట్లో ఏర్పాటు చేయలేదు. వేసవిలో ఏర్పాటు చేయాలనుకున్నా తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని చేయించలేదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఐదు రోజులుగా ఇదే పనిపేరుతో జిల్లాలోని కొన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో నీటి సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నా కాలనీలకు సరిపోవడం లేదు. అలాగే గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది.
రేవల్లి సమీపంలో జీరో వెల్సిట్ వాల్వ్, రేవల్లి గుట్ట వద్ద ఎయిర్‌వాల్వ్, వనపర్తి మండలం అచ్యుతాపురం-చిట్యాల మధ్య క్లియర్ వాల్వ్, గేట్ వాల్వ్‌లను ఏర్పాటు చేశారు. చివరగా పెద్దమందడి మండలం జగత్పల్లి సమీపంలో మరో ఎయిర్‌వాల్వ్ పెట్టే పనులు శుక్రవారం సాయంత్రం వరకు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పైపులైన్ స్థితిని బట్టి అవసరమైన వాల్వ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కూడా నీటి విడుదల కష్టమేనన్న సమాచారం ఉన్న ది.
కాగా, వర్షాల ప్రభావంతో రెండు రోజులనుకున్న ఈ వాల్వ్ ఏర్పాటు పనులు ఇలా ఐదు రోజులైనా పూర్తికాకపోవడంతో నీటికటకటలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా, వనపర్తి మండలంలోని రాజపేట సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో నీటి సమస్య ఉత్పన్నమైంది. ఇలా వేసవిలో పైపులైన్ వేసినప్పుడు చేయాల్సిన పనులు ఇప్పుడు చేపట్టడం.. అందుకు వర్షాల అడ్డంకులు వెరసి ప్రజలకు వేసవిలో లేని దాహార్తి నిండు వానకాలంలో ఉత్పన్నమైంది. కాగా, జిల్లాలోని మిషన్ భగీరథ గ్రిడ్‌లో పని చేసే ముగ్గురు ఏఈలు సైతం జిల్లా నుంచి బదిలీ కావడంతో ప్రస్తుతం అంతా ఖాళీ అయ్యింది.
మిషన్ భగీరథ పైపులైన్‌ను అనుసరించి కొన్ని వాల్స్ ఏర్పాటు చేయడం కోసం మంగళవారం నుంచి భగీరథ నీటి సరఫరాను నిలిపివేశాం. రెండు రోజుల్లోనే పూర్తి చేయాలనుకున్నాం. వర్షాలు రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఆరు చోట్ల వాల్స్ ఏర్పాటు పూర్తయ్యింది. చివరి వాల్ జగత్పల్లిలో చేస్తున్నాం. శనివారం నీటి విడుదల కొనసాగిస్తాం.
– మేఘారెడ్డి, మిషన్ భగీరథ ఈఈ, వనపర్తి జిల్లా
ఎండకాలం కూడా నీళ్ల కోసం ఇంత గోసపడలేదు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. ఎవరిని అడగాలో తెల్వవక ఇబ్బందులు పడుతున్నాం. నల్లా నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్లతో తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పదేం డ్లలో ఏరోజూ నీళ్లకోసం గింత ఇబ్బంది పడ లే. ట్యాంకర్ల నీళ్లు వాడుకోవడానికి మాత్రమే వస్తా యి. తాగడానికి పనికి రావు. మిషన్ భగీరథ నీళ్లు వదిలి మా కష్టాలు తీర్చండి సారు.
-సుశీల దంతనూరు, , మదనాపురం మండలం
ఐదు రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదు. ఒకట్రొండు రోజులు ఎలాగోలా సర్దుకున్నాం. ఇన్ని రోజులు నీళ్లు రాకుంటే ఎట్లా. సర్పంచు లు ఉంటే అడిగేటోళ్లం. ఇప్పుడు ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. 15ఏండ్ల కిందట కాంగ్రెస్ సర్కారులో నీళ్లు లేక పంటపొలాలకు వెళ్లి బిందెల్లో కిలోమీటర్లు నడిచి తెచ్చుకునేటోళ్లం. పదేండ్లు నీళ్లు న ట్టింట్లో వొచ్చినయి. గిప్పుడు మళ్లా పాత రోజులు షురూ అయినట్టున్నయి.
– చిట్టెమ్మ, మదనాపురం, గ్రామం, మండలం
వనపర్తి పట్టణంలో నాలు గు రోజులుగా తాగునీళ్లు రావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీ పనికి వెళ్లి ఇంటికి వ చ్చేసరికి నీటి కొరతతో ప నులు కావడం లేదు. ట్యాం కర్లతో నీళ్లు పోసినా సరిపోవడం లేదు. అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించాలి.
– శేషమ్మ, లక్ష్మీనర్సింహాకాలనీ, వనపర్తి
పట్టణంలోని 33వ వార్డు లో నీటి సమస్య అధికంగా ఉన్నది. గతంలో అనేక సా ర్లు తాగునీటి సమస్య గు రించి మున్సిపల్ చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకె ళ్లాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మహిళలందరం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
-ఏ లక్ష్మి, సాయినగర్ కాలనీ, వనపర్తి