మహబూబ్‌నగర్ అర్బన్, మే 1 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడు తూ బొడ్రాయి పండుగకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టాలకు నీళ్లు ఇ వ్వలేక పండుగ కూడా సక్కగా చేసుకోలేక ఇబ్బందులు పడ్డామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రోజూ తాగునీరు ఇంటి దగ్గరే పట్టుకున్న తాము.. కాంగ్రెస్ హయాంలో ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.
ఆందోళన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న 16వ వార్డు కౌన్సిలర్ మోతిలాల్‌తో వారు వాగ్వాదానికి దిగారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి సరఫరా చేసే పైప్‌లైన్ వద్ద గేటు వాల్వ్ లేకపోవడంతో నీటి సరఫరా ఆగిపోయిందని, ఈ విషయం కౌన్సిలర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇందుకు కౌన్సిలర్ గత చైర్మన్ తనకు సహకరించలేదని చెప్పగా.. ‘ఎం దుకు అబద్ధాలు మాట్లాడుతున్నావ్.. కేసీఆర్ ప్రభుత్వం లో ఈ ఒక్క గ్రామంలోనే 14 బోర్లు వేసి తాగునీటి ఎ ద్దడే లేకుండా చేశారు.. కాంగ్రెస్ హయాంలో ఆ బోర్ల లో ఉన్న మోటర్లన్నింటినీ ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు.. ఈ విషయం నీకు తెలియదా’ అంటూ కౌన్సిలర్‌ను నిలదీశారు. అంతటితో ఆగక రాజకీయ స్వార్థం కోసం బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లోకి పోయావని నీటి సమస్య ఎందుకు తీర్చడం లేదని.. ఇప్పుడున్నది మీ చైర్మనే క దా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో కౌన్సిలర్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకోకు దిగినా మున్సిపల్ అధికారులు ఎవ రూ అటువైపు రాకపోవడంతో తాగునీటి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు. రాస్తారోకో చేయడంతో మహబూబ్‌నగర్-నవాబ్‌పేట రోడ్డుపై అటు ఇటూ వాహనాలన్నీ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు గంటలు ధర్నా చేయడంతో కాంగ్రెస్ నేతలు పోలీసు లతో బలవంతంగా మహిళలను రోడ్డుపై నుంచి పక్కకు నెట్టివేయించారు. ఒక్క రోజులో సమస్య పరిష్కారం కాకపోతే మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరించారు.