పెంట్లవెల్లి, డిసెంబర్ 8 : తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ మండలంలోని గో ప్లాపురంలో ఆదివారం గ్రామస్తులు కాలిబిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివమ్మ, ఈశ్వరయ్య, రమణ య్య, నారమ్మ, సవారయ్య మాట్లాడుతూ గ తంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సా గునీటితోపాటు తాగునీటికి ఢోకా లేకుండా ఉండేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేవారని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన ఏడాదిలోనే పలుమార్లు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4, 5వ వార్డుల్లో పది రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదని వాపోయారు. సమస్య ను పరిష్కరించాలని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి సువర్ణలతతో మొరపెట్టుకున్నా.. స్పందించడం లేదని ఆరోపించారు. చేసేది లేక వ్యవసాయ బోర్ల వద్ద రోజూ తాగునీటిని తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడిందని వాపోయా రు. ఈ విషయంపై ఎంపీడీవో దేవేందర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.