పెద్దమందడి, అక్టోబర్ 24 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్థిక వనరులు సరిగా లేవనడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. మరి హా మీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక వనరులు గుర్తుకు రా లేదా అని ఆయన ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మండల పార్టీ అ ధ్యక్షుడు వేణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎ క్కడా లేని విధంగా అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసాను ఎగవేసిందని, రుణమాఫీని అరకొర గా చేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు రాజులా ఉంటే నేడు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, రైతుబీమా లాంటి అనేక పథకాలు తీసుకువస్తే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వానకాలం పంట కు రైతుభరోసా ఇవ్వలేమని చావుకబురు చల్లాగా చెప్పాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతులకు రూ.2లక్షలలోపు రుణమాఫీ ఆగస్టు 15వ వరకు చేస్తామ ని దేవుండ్ల మీద ఒట్టుపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి నిలువునా మోసం చేశారన్నారు. రైతులను నిలువు దోపిడీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 29న నిర్వహించనున్న రైతుల సమరభేరీ కార్యక్రమానికి రైతు లు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ విజయ్, జాత్రునాయక్, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మండ లాధ్యక్షుడు వేణుయాదవ్, నాయకులు నాగేంద్రంయాదవ్, కుమార్‌యాదవ్, సేనాపతి, సురేశ్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, జగన్మోహన్రెడ్డి, కురుమూ ర్తి, రాములు, నాగభూషణ్ తదితరులు ఉన్నారు.