కొత్తకోట : కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం (Ayyappa temple) ఆలయ నిర్మాణానికి మండలంలోని అమడబాకుల గ్రామానికి చెందిన డబ్బి రాజేశ్వరి , రవి గౌడ్ దంపతులు రూ. 1,01,916 విరాళాన్ని ( Donations ) అందజేశారు. దంపతుల కుమారుడు డబ్బి మణికంఠ జన్మదినం సందర్భంగా ఈ విరాళాన్ని అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పొగాకు అనీల్ కుమార్ , విశ్వనాథం గంగాధర్, బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , లక్ష్మీ నారాయణ యాదవ్ , వేముల సుధాకర్ రెడ్డి , రవీంధర్ రెడ్డి , దంతనూర్ రాజశేఖర్ , భాస్కర్ రెడ్డి , రవి రెడ్డి , కరెంట్ అంజి, భీమ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.