జిల్లా దవాఖానలో వసతులు కల్పించాలి
ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి హౌస్ సర్జన్ శాలిని తీసుకొచ్చారు. పదేండ్లుగా దవాఖాన, మెడికల్ కళాశాలకు వైద్యసేవలో గుర్తిం పు తీసుకొచ్చామని తెలిపారు.
- వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను కోరిన వైద్యులు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 : ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి హౌస్ సర్జన్ శాలిని తీసుకొచ్చారు. పదేండ్లుగా దవాఖాన, మెడికల్ కళాశాలకు వైద్యసేవలో గుర్తిం పు తీసుకొచ్చామని తెలిపారు.
దవాఖానను కొత్త భవనంలోకి మార్చితే మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. హైదరాబాద్ వెళ్లకుండా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్పందించిన మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో భవనం పనులు పూర్తి చేసి జూన్‌లోగా దవాఖాన తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రభు త్వ దవాఖానలో నిర్వహించిన స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని విప్, ఎమ్మెల్యే యెన్నంతో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాల్టీ దవాఖాన రిఫరల్ సెంటర్‌గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కుష్బూ గుప్తా, అ దనపు కలెక్టర్లు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

