వనపర్తి టౌన్, మే 23 : వైద్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్లు ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉండాలని అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, దవాఖాన సూపరింటెండెంట్లు, హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో హెచ్వోడీలు అందుబాటులో లేకపోతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించలేమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇక నుంచి బయోమెట్రిక్‌తోపాటు మ్యానువల్ హాజరు రిజిస్టర్ ప్రతి నెలా తనకు పంపించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ దవాఖాన, మాతా శిశు సంరక్షణ దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. దవాఖానలో మౌలిక సదుపాయాలపై చర్చిస్తూ రోగులకు అవసరమైన వీల్ చైర్లు, కూర్చోవడానికి బెంచీలు మరిన్ని కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ప్రతి నెలా 400 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలో కంటి ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చినందున జిల్లాలో కంటి పొరలతో ఇబ్బందులు పడుతున్న వారికి శస్త్ర చికిత్సల ద్వారా వైద్యం చేయాలని ఆదేశించారు. ఈ విషయమై పీహెచ్‌సీల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో చెవి, ముక్కు, గొంతు నొప్పి వ్యాధులతో బాధపడే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానలో ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఎస్ఎం ఐడీసీ ఇంజినీరింగ్ అధికారుల ను ఆదేశించారు. అదేవిధంగా మాతా శిశు వైద్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న కేర్ యూనిట్‌ను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రంగరావు, డిపార్ట్మెంటల్ హెడ్స్ పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, మే 23 : వనపర్తి జిల్లాలో పదో తరగతిలో ఉత్తీర్ణత దిశగా బోధన జరగాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పా ఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుల్లో ప్రావీణ్యత మెరుగుపర్చుకునేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. పిల్లలకు లెక్కలు సులువుగా అర్థమయ్యేలా మాస్టర్ బోధిస్తుండగా కలెక్టర్ కూడా ఉపాధ్యాయులతో కూర్చొని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని బాధ్యతగా తీసుకోవాలన్నారు. పదో తరగతిలో విద్యార్థి ఫెయిలైతే ఉపాధ్యాయులు ఫెయిలైనట్లేనని భావించాలన్నారు. వనపర్తి జిల్లాలో గణితంలో విద్యార్థులు ఫెయిలవుతున్నారని, మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయు లు చాలా ఉత్తమంగా ఉంటారనడం లో సందేహాం లేదన్నారు. అందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో వి ద్యార్థుల కు బోధించడమేనని ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీఈ వో అబ్దుల్ ఘనీ, సెక్టోరియల్ అధికారి మహానంది తదితరులు ఉన్నారు.
పరిసరాల్లో దోమలు ప్రబలకుం డా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆ దర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవా రం వనపర్తి పట్టణంలోని నాగవరం, ఇందిరాకాలనీ, 5, 10 వార్డుల్లో మున్సిపల్ వైద్యారోగ్య శాఖ ద్వారా డ్రైడే ప్రైడే కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. వర్షపు నీరు, కొబ్బరి చిప్ప లు, పాత టైర్లు, పడవేసిన సీసా మూతల్లో నిలిచిన నీటిలో డెంగీ దోమలు గు డ్లు పెట్టి పెరుగుతాయని, అందువల్ల ఇం డ్ల కప్పుపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతోపాటు శుక్రవారం ప్రజలు ఇండ్లలో నీరు పారబోసేలా అ వగాహన కల్పించాలన్నారు. ఇండ్లలో ఎవరికైనా జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యారోగ్య పరీక్షలు చేయించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. వారంరోజుల్లో వర్షకాలంలో ప్రారంభవుతుందని, దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు దోమల వల్ల వస్తాయని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వార్డుల్లో పర్యటిస్తూ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలా అవగాహన క ల్పిస్తారని ఆశ కార్యకర్తలను ఆరాతీశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ పరిమళ, ఆశవర్కర్లు ఉన్నారు.