అయిజ, సెప్టెంబర్ 4 : అయిజ పట్టణానికి చెందిన చిట్టి అనే దివ్యాంగురాలిని వానరం కొరికింది. దీంతో వైద్య చికిత్స కోసం బుధవారం ఆమె స్థానిక పీహెచ్‌సీకి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ప్రభుత్వం సరఫరా చేసిన మాత్రలను అందజేశారు. ఆమె ఇంటికి వెళ్లి, మాత్రలు వేసుకునేందుకు కుటుంబీకులను సంప్రదించింది. వారు మాత్రను పరిశీలించి, క్యాల్షియం ట్యాబ్లెట్ జూలై నెలలోనే గడువు ముగిసినప్పటికీ అందజేసినట్లు గుర్తించారు.
గురువా రం ఈ విషయమై సోషల్ మీడియాలో పో స్టు చేశారు. వెంటనే అప్రమత్తమైన డీఎంహెచ్‌వో సిద్దప్ప కాలం చెల్లిన మాత్రల పంపిణీపై డాక్టర్ కిరణ్‌కుమార్, ఫార్మసిస్టు అమృతరాజుపై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వెంటనే సమాధానం చె ప్పాలని ఆదేశించారు. అయిజ పీహెచ్‌సీపై ప్రత్యేక దృష్టి సారించి, వైద్య సేవలను మె రుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో చెప్పారు.
సస్పెండ్ చేయాలి..
కాలం చెల్లిన మాత్రలు పంపిణీ చేసిన ఫార్మసిస్టుతోపాటు పీహెచ్సీ వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం పీహెచ్‌సీని తనిఖీ చేసి కాలం చెల్లిన మాత్రల పంపిణీ గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
గడువు తీరిన మాత్రలు ఎలా పం పిణీ చేశారని నిలదీశారు. అలాగే పీహెచ్సీ లో 30 పడకల అదనపు భవనం ప్రారంభోత్సవానికి ముందే పగుళ్లు వచ్చిందని, కిటికీ లు ధ్వంసమయ్యాయని, కొత్త భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మా రినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో తులసీగౌడ్, రాజు, సూర్య, రమేశ్ తదితరులు ఉన్నారు.