జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 50 శాతం సబ్సిడీతో జీలుగ(Jiluga) , జనుము(Janumu) విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి( MLA Anirudh Reddy) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ఆగ్రోస్ కేంద్రంలో సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయడం కోసం 50 శాతం సబ్సిడీపై జీలుగా, జనుము విత్తనాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీలుగ 30 కిలోల బస్తా పూర్తి ధర రూ.4,275 ఉండగా 50 శాతం సబ్సిడీపై రూ. 2,137 చెల్లించాలని తెలిపారు.
జనుము 40 కిలోల బస్తా పూర్తి ధర రూ.5,020కు 50 శాతం సబ్సిడీపై రూ . 2,510కు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ కృష్ణ కిషోర్, మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్, నాయకులు జనార్దన్ రెడ్డి, గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.