ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జూలై 30 : అర్హులందరికీ గొర్రెలు పంపి ణీ చేసేందుకు ప్రభుత్వం సి ద్ధంగా ఉందని, నియోజకవర్గంలో రెండో విడుత గొర్రెల పంపిణీకి డీడీలను చెల్లించాలని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం అన్నాసాగర్ గ్రామంలో ప శువైద్యాధికారులతో ఎమ్మె ల్యే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువైద్యాధికారులు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని డీడీలను చెల్లించాలని, ఒక గ్రామంలో 100శాతం గొర్రెలను పంపిణీ చేయాలని సూచించారు. నియోజకవర్గంలో పాత పశువైద్యాశాల భవనాలున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా కొత్త భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు మధుసూదన్, జసనల్లి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, లక్ష్మీనర్సింహాయాదవ్ పాల్గొన్నారు.
దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆల సూచించారు. అన్నాసాగర్ గ్రామంలో మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామానికి చెందిన రజినీకాంత్‌కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చక్రాపూర్ గ్రామానికి చెందిన షేఖ్ సిరాజ్, వర్దావత్ లక్ష్మమ్మకు రైతుబీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహాయాదవ్, ఎంపీడీవో స్వరూప, స ర్పంచులు శైలజా, స్వరూప, నాయకులు శివరాములు, కొండన్న, సత్తార్, శేఖర్, చంద్ర య్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
రూ.4లక్షల ఎల్వోసీ అందజేత..
దేవరకద్ర మండల కేంద్రంలోని తెలుగు గే రికి చెందిన మణెమ్మ అనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.4లక్షల మంజూరు చేయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఎల్వోసీని శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.