వనపర్తి, జనవరి 24 : జిల్లా ప్రజలకు ఏ ఆపద వ చ్చినా వెంటనే ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభయం ఇ చ్చారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో మృ తి చెందిన పార్టీ కార్యకర్త సాయికుమార్ తల్లి వెంకటమ్మకు పార్టీ బీమా రూ.2 లక్షల చెక్కును నిరంజన్‌రెడ్డి అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఆం జనేయులు ఎద్దులు కొన్ని రోజుల కిందట గున్నం చెరువులో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రెండు కోడెలను అందించి మానవత్వం చాటుకున్నారు. ప్రతి దానిని డబ్బులతో ముడిపెడితే తీరే బాధ కాదని, తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న జీవాలు అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంటుందని, దానికి డబ్బులు ఇస్తే సరిపోదన్న ఉద్దేశంతో తన వద్దనున్న రెండు కోడెలను అం దించినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణంలోని 12వ వార్డుకు చెందిన వడ్డె రమేశ్‌కు ఇటీవల జరిగిన ప్రమాదంలో చెయ్యి విరగగా.. నిరంజన్‌రెడ్డి బాధితుడి ఇంటి కి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ అండ గా ఉంటామని, ఏ చిన్న విషయమైనా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, సర్పంచ్ కొండన్న, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అశోక్, బుచ్చిబాబు, వా ర్డు సభ్యుడు భాస్కర్‌గౌడ్, మీడియా కన్వీనర్ అశోక్‌కుమార్, దేవేందర్, మాధవరెడ్డి, విజయ్‌కుమార్, తిరుమలయ్య, బాలస్వామి, లక్ష్మీకాంత్‌రెడ్డి, సునీల్ ఉన్నారు.
పెబ్బేరు, జనవరి 24 : పెబ్బేరులో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వరుణ్‌యాదవ్ కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి, పార్టీ మండలాధ్యక్షుడు రాము లు, నాయకులు ఎల్లయ్య, చిన్న ఎల్లారెడ్డి ఉన్నారు.