
నారాయణపేట, డిసెంబర్ 13 : పార్టీ కార్యకర్తలకు ప్ర భుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంప్ కా ర్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణానికి చెందిన సమ్రీ న్ బేగానికి రూ.16వేలు, అల్వాల్ రమేశ్‌కు రూ.40వేలు, కృష్ణవేణమ్మకు రూ.60వేలు, జ్యోతికి రూ. 24వేలు, చంద్రశేఖర్‌కు రూ.55వేల500, కిష్టారెడ్డికి రూ.2 7వేలు, గౌసియాకు రూ.30వేలు, ధన్వాడ మండలం కొం డాపూర్కు చెందిన కృష్ణయ్యకు రూ.60వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీటీసీ, సర్పంచ్ కుటుంబ సభ్యులకు పరామర్శ
పుసల్పా డ్ ఎంపీటీసీ, పెద్ద చింతకుంట సర్పం చ్ కుటుంబాల్ని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల పెద్దచింతకుంట సర్పంచ్ తల్లి రామలక్ష్మ మ్మ, పుసల్పాడ్ ఎంపీటీసీ మణెమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకొ ని సోమవారం మండలంలోని పెద్దచింతకుంట, పుసల్పా డ్ గ్రామాలకు వెళ్లి పెద్ద చింతకుంట సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పుసల్పాడ్ ఎంపీటీసీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంపీటీసీ మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. రామలక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.