నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24 : జిల్లాలో పీవీటీజీ (పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూ ప్స్)గా గుర్తింపబడిన చెంచులకు ప్రధానమం త్రి జన్మన్ కార్యక్రమం ద్వారా వసతులు క ల్పించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పీఎం జన్మన్ జనజా తి ఆదివాసీ న్యాయ మహాఅభిమాన్ పథకంపై ఐటీడీఏ పీవో రోహిత్గోపిడితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఇప్పటి వరకు చెంచు పెంటల్లో జరిగిన పనులు, జరగాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తె లుసుకున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 88 ఆదివాసీ చెంచు పెంటల్లో నివసిస్తున్న 8,772 మంది చెంచులకు ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా 11రకాల మౌలిక వసతులు అందేలా చూడాలన్నారు. చెంచు ప్రజలందరికీ ఆధార్‌కార్డులను రాను న్న వారం రోజుల్లో అందించాలన్నారు. చెం చుల నివాస ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరైన 890 ఇండ్లు, రోడ్ల వసతి, నివాసాలకు తాగునీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూ నిట్లు, అంగన్వాడీ సెంటర్లు, అన్ని పెంటల్లో విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేయాలని చెప్పారు.
పథకాలు అందించడంలో ఇబ్బందులు లే కుండా గుర్తింపు కార్డులు అందించేందుకు ప్ర త్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వారంలోగా అందరికీ జనన ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు లు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, కిసాన్ క్రెడి ట్ కార్డు అందించాలని పేర్కొన్నారు. చెంచులకు ఎవరికైతే బ్యాంకు ఖాతాలు లేవో వా రందరికీ జన్‌ధన్ ఖాతాలను తెరిపించేలా చ ర్యలు తీసుకోవాలని ఎల్డీఎంకు సూచించా రు. అదేవిధంగా పట్టా కలిగి ఉన్న కుటుంబ భూ యజమాని మరణిస్తే వారి కుటుంబ వా రసులకు భూబదలాయింపులను నిరంతరం గా కొనసాగించాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి రమేశ్, డీఆర్డీవో చిన్న ఓబులేశ్, డీపీవో రామ్మోహన్రావు, అచ్చంపేట, కొల్లాపూర్ ఆర్డీవోలు మా ధవి, నాగరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, తాసీల్దార్లు పాల్గొన్నారు.