మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలి టీల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చిచ్చు రేపుతున్నాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో తమ వాళ్లకు టికెట్ ఇప్పించుకోలేక ఏకంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురయ్యారు. మూడురోజులుగా పార్టీ నాయకులకు క్యాడర్‌కు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న ది. మరోవైపు పార్టీ నేతలు కొందరు తమకు కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించేందుకు భారీగా డబ్బులు చేతులు మారినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి తేవడంతో ఎమ్మెల్యే వర్గానికి తగిన ప్రా ధాన్యం దక్కకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది.
చివరకు ఎమ్మెల్యే లేకుండానే టికెట్లు కేటాయింపు జరగడం.. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. మరోవైపు గద్వా ల కాంగ్రెస్‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి మరో కాంగ్రెస్ నేత సరితకు మధ్య బీఫా ంలో గొడవ తారాస్థాయికి చేరింది. పార్టీ అధిష్టానం ఆదేశించిన ఎమ్మెల్యే వర్గీయులు ముందుగానే బీఫాంను రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతో తర్వాత బీఫామ్స్ పొందిన సరిత వర్గీయులకు మొండి చెయ్యి చూపించినైట్లెంది. ఇక నాగర్‌కర్నూల్‌లో టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు.
సాక్షాత్తు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కోస్గిలో సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు పార్టీకి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది. మిగతా మున్సిపాలిటీ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్‌తోపాటు మిగతా మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఎలాంటి గొడవలు లేకుండా ఎంపిక చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరించడంతో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే ప్రచారంలో దూసుకుపోతుంది.
మూడ్రోజులుగా టచ్‌లో లేకుండా..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అలిగినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రోజులుగా ఇటు క్యాడర్‌కు, అటు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ కాంగ్రెస్ ము ఖ్యనేత ఇంట్లో టికెట్ల కేటాయింపు వ్యవహారంలో చర్చలు జరుగుతుండగా పెద్ద రభస చోటు చేసుకోవడం.. ఓ ముఖ్య నేతకు గుండెపోటు రావడంతో హుటాహుటిన మల్లికా దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మరోవైపు మూడురోజులుగా ఎమ్మెల్యే టికెట్ల పంచాయితీ తనకి ఎందుకని పార్టీ నేతలను మీరే చూసుకోండి అంటూ అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
మా టికెట్లు అమ్ముకున్నారు..
టికెట్లు రాని నేతలంతా శాపనార్థాలు పెడుతుండడం.. మరి కొంతమంది కన్నీళ్ల పర్యంతం కావడం కనిపించింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో బీఫాంలు దక్కని కాంగ్రెస్ నేతలు డీసీసీ అధ్యక్షుడి సాక్షిగానే దుమ్మెత్తి పోశారు. తమకు కావాలని టికెట్లు ఇవ్వలేదని కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని బహిరంగంగా ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు వీళ్లకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. కాంగ్రెస్ ఓటమికి నా యకులే పకడ్బందీగా సహకరిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను కావాలని టార్గెట్ చేస్తూ కొంతమంది నేతలు ప్రోత్సహిస్తున్న తీరుపై ఆయన వర్గీయులు ప్రతి దాడి చేస్తున్నారు.
వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసి అధికార పార్టీకి దడ పుట్టిస్తున్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో పదో వార్డు అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ బోణి కొట్టింది. మరోవైపు ఓడిపోతామని భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలో వార్డు అభ్యర్థిని బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు ప్ర యత్నించడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి రంగంలోకి దిగి విఫలం చేశా రు. మరోవైపు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మా జీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎమ్మె ల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గద్వాల పార్టీ ఇన్చార్జి హ నుమంతునాయుడు గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించారు. మరోవైపు ఎలాంటి అసంతృప్తులు లేకుండా క్యాడర్‌ను కాపాడుకోవడంతోపాటు పార్టీ టికెట్లు దక్కకపోయినా వారందరికీ ఒప్పి ంచి ఉపసంహరించుకునేలా చేశారు. దీంతో ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు జరగడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎలాంటి గొడవలు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలిపారు. ఇక ప్రచారంపై దృష్టి సారించారు. మొత్తంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది.
కందనూలులో అరాచకాలు
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రె స్ నేతలను ఓటమి వెంటాడుతుండడంతో ఆరాచకాలకు తెగబడుతున్నారు. వార్డుల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను చూసి ఓటమి చెందుతామేమోననే భయం పట్టుకుంది. కొందరిని బ్లాక్మెయిల్ చేసి పార్టీలోకి లాక్కోవడంతోపాటు నామినేషన్ వేసిన వారిని సైతం కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేయాలని లేదా విత్‌డ్రా చేసుకోవాలని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి నసీమాబేగం ఇంటికి మంగళవారం వెళ్లిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మరికొందరు కాంగ్రెస్ నేతలు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారు. విషయం తెలుసుకున్న మర్రి జనార్దన్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నేరుగా అభ్యర్థి నసీమాబేగం ఇంటికి వెళ్లారు. మా అభ్యర్థిని ఎందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, విత్‌డ్రా చేసుకోవాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. ఈక్రమంలో అభ్యర్థి ఇంట్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
చివరకు పోలీసులు జోక్యం చేసుకొని అభ్యర్థి నిర్ణయం మేరకు ఇరువర్గాలు నడుచు కోవాలని సూచించారు. దీంతో 15వ అభ్యర్థి నసీమా మర్రి నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు తెల్లమొఖం వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇదే వార్డు నుంచి తవిటి తవిత అనే మహిళ సైతం నామినేషన్ వేయగా ఆమెను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా చేర్చుకున్నారని తెలుస్తోంది.