MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Anirudh Reddy | రూ.6 వేలు అన్నడు.. రైతు బంధు రావడం లేదంటూ ఓ దివ్యాంగుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎదుట వాపోయాడు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
Anirudh Reddy | సొంత సర్కార్‌పై ఎప్పుడికప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ.. అన్యాయాన్ని ప్రశ్నించే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఎప్పటికపుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని పెంచుతామన్న పెన్షన్లపై ఓ దివ్యాంగుడు నిలదీశారు.
తనకు ఎదురుగా వచ్చిన ఓ దివ్యాంగుడిని మీకు ఏం కావాలె అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అడిగారు. దానికి దివ్యాంగుడు స్పందిస్తూ.. సార్ రూ.6 వేల పెన్షన్ ఇస్తమన్నరు.. ఎప్పుడిస్తరు అని అడిగాడు. పెన్షన్ అనేది రాష్ట్ర సమస్య.. ముఖ్యమంత్రి చూస్తడు.. ఇది నా చేతుల్లో లేదు.. నా చేతుల్లో ఉంటే ఇప్పుడే సంతకం పెడతా.. నేను సీఎంను ఖచ్చితంగా అడుగుతా.. అందరు ఎమ్మెల్యేలు అడగాలి.. నేనొక్కడినే అడిగి అడిగీ మైనస్ అవుతున్నానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోవడం గమనార్హం.. అయినా ఏం ప్రాబ్లమ్ కాదు అడుగుతా నేను అంటూ చెప్పుకొచ్చారు.
సార్ రూ.4 వేలు అన్నడు.. రూ.6 వేలు అన్నడు.. రైతు బంధు రావడం లేదంటూ సదరు దివ్యాంగుడు వాపోయాడు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
6 వేల పెన్షన్ అన్నారు.. ఎప్పుడిస్తారు
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నిలదీసిన దివ్యాంగుడు
అది నా చేతిలో లేదు, రేవంత్ రెడ్డి చేతిలో ఉందని తప్పించుకుని వెళ్లిపోయిన అనిరుధ్ రెడ్డి
మీరంతా కలిసే అతన్ని సీఎం చేశారు కదా ఇప్పుడు మా చేతిలో లేదంటే ఎలా అంటూ నిలదీత
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

