వనపర్తి టౌన్, అక్టోబర్ 9 : కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఎన్నికల సమరం సాగించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగరవం సమీపంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖిల్లాఘణపురం మం డల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంకార దోరణితో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర న ష్టం వాటిల్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హా మీల అమలులో ఘోర వైఫల్యం చెం దిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నట్టేటా ముంచారన్నారు. మన పంపిణీ చేసే కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజల బ్రహ్మాస్త్రం కావాలన్నారు.
మన పార్టీకి సమర్థవంతమైన నాయకులు, సుశిక్షితులైన కార్యకర్తలు ఇతర సంప్రదాయ పా ర్టీలకు లేరని ఇది మనకు బలమని అ న్నారు. బాకీ కార్డుల పంపిణీకీ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ప్రతి ఇంటికి వెళ్లి బాకీ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో బకాయి పడిన రూపాయలను ప్రజలకు వివరించాలన్నారు. రేవంత్‌రెడ్డి అభివృద్ది చేయకుండా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రేవంత్‌రెడ్డిది ప్రైవేట్ వ్యవస్థ నడుపుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా వంటి పథకాలకు మం గళం పలికారన్నారు. ఖిల్లాఘణపురం మం డలం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని రాబోయే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఖిల్లాఘణపురం మండలంలోని తి రుమాలయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ, బుడ్డ య్య, కృష్ణయ్య , దాసు, నర్సింహులు , తిరుమలేశ్, పెబ్బేర్ మండలం సూగురు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ శ్రీనివాసులు, బెక్కం రఘు, హనుమన్న, జ యరాం, దశరథం, బాస్కర్, పులేందర్, బాలరాజుగౌడ్ తదితరులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి గులాబీ కండువా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో కొత్త , పాత అనే తేడా లేకుండా పార్టీ బ లోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ ఎంపీపీ కృష్ణనాయక్, మీడి యా కన్వీనర్ అశోక్, మాజీ జెడ్పీటీసీ సామ్యానాయక్, రంగారెడ్డి, బాలీశ్వర్‌రెడ్డి, జాత్రునాయక్, వెంకట్‌రెడ్డి, వనం రాములు, పెద్దింటి వెంకటేశ్, మధు, రమేశ్, గోవిందు పాల్గొన్నారు.