మహబూబ్నగర్ విద్యావిభాగం, సెప్టెంబ ర్ 30 : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడా ది జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వెబ్సైట్లో పొందుపర్చిన జాబితాలో పేరున్న అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను జిల్లాల వారీగా ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ చేయనున్నారు. అభ్యర్థు లు అప్లికేషన్ ఫారంతోపాటు 2 సెట్ల అటెస్టేషన్ సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని డైట్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉం టుందని డీఈవో రవీందర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 243, నాగర్కర్నూల్లో 285, నారాయణపేటలో 279, వనపర్తిలో 152, జోగుళాంబ గద్వాల జిల్లాలో 172 ఖాళీలు డీఎస్సీ ద్వా రా నియామకాలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్నాయి.