కొత్తకోట / ఆత్మకూరు / మక్తల్ : తెలంగాణ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు (ASHA workers ) స్థిరమైన వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహాబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశకార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కొత్తకోట, ఆత్మకూరు, మక్తల్ మండల తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు.
మార్చి నెలలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 వేతనం నిర్ణయించాలని కోరారు. ఆశలకు పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎం పోస్టులో ప్రమోషన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో కొత్తకోటలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జె.భాగ్య, మంజుల, పుష్ప పాల్గొన్నారు.ఆత్మకూర్‌లో నిర్వహించిన ధర్నాలో సిఐటియు నాయకులు బుచ్చన్న, ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు రాజేశ్వరి , ఆశా వర్కర్లు సత్తెమ్మ సంధ్య మేరీ సుశీల పుష్పలత సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మక్తల్‌లో నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు, మక్తల్ పీహెచ్సీ నాయకురాలు గోవిందమ్మ, అమీనా బేగం, యశోద, ఇందిరా, అనిత, పార్వతమ్మ, వెంకటలక్ష్మి, ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.