కల్వకుర్తి, జూలై 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు చేపడతామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్వీ కల్వకుర్తి మండలాధ్యక్షుడు గ ణేశ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, 11 వేలతో కా కుండా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని పేర్కొన్నారు. సమయం తక్కువగా ఉన్నందున డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించాలన్నారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 2 వేల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి ఆర్డీవో శ్రీనుకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్గౌడ్, బీఆర్ఎస్వీ మండల ఉపాధ్యక్షుడు నాగరాజు, కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు రాజునాయక్, పాం డు, ప్రేమ్, శ్రీవాణి, మానస, మాధవి పాల్గొన్నారు.