కల్వకుర్తి, సెప్టెంబర్ 21 : బకాయి ఉన్న నాలుగు పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం కల్వకుర్తి పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి- హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు ధర్నా నిర్వహించారు. కొందరు రైతులు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలుపోస్తున్నామని, కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చే శారు. 15 రోజులకు చెల్లించాల్సిన పాలబిల్లులు 4 వి డుతలుగా పెండింగ్‌లో ఉన్నాయని, పాడిని నమ్ముకొని బతుకున్న తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయ ని వాపోయారు. ఇంటి ఖర్చులు, కిరాణ, పశువుల దాణ, పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులకు పాల బిల్లులే ఆధారమన్నారు.
రెండు నెలలుగా బకాయిలు ఉండడంతో దిక్కుతోచకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుం చే ఈ పరిస్థితి దాపురించిందని, రైతులను అరిగోసకు గురిచేస్తున్నదని మం డిపడ్డారు. ఒక్కో పాడి రైతుకు 4 బిల్లులకు గానూ సరాసరి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు విజయ డెయిరీ బ కాయి ఉందని చెప్పారు. రైతులంటే ప్రభు త్వం చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న నాలుగు బిల్లులను ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాడిరైతులు కిశోర్, బాలరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, ఖాజాపాష, మల్లే శ్, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, సురే శ్, శ్రీనివాస్, కృష్ణయ్య పాల్గొన్నారు.