అమరచింత/ధరూర్, ఏప్రిల్ 4 : నేరరహిత సమాజ నిర్మా ణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువారం అమరచింత మండలంమస్తీపూర్లో ఐజీ రమేశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సొంత గ్రామమైన మస్తీపూర్‌లో 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని డీజీపీ జితేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపం చం మొత్తంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవడంతో చైనా మొదటి స్థానంలో, లండన్ రెండో స్థానంలో ఉండ గా, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, అందు లో మొదటి స్థానంలో హైదారబాద్గా చెప్పుకోవచ్చుని అన్నా రు. తాను 1997లో మహబూబ్‌నగర్ ఎస్పీగా పనిచేశానని అప్పటితో పో ల్చుకుంటే ఇప్పడు నేరాలు చాలా వరకు తగ్గిపోయాయని అం దుకు ప్రదాన కారణం సీసీ కెమెరాల ఏర్పాటేనని అందుకే ప్రజలు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
అనంతరం జూరాల ప్రాజెక్టు సమీపంలో పోలీస్ అవు ట్ పోస్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదూవిధంగా ధరూర్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మో హన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ గురునాథ్డ్డ్రి, హైదారబాద్ మల్టీ జోన్ ఐజీపీ సత్యనారాయణ, జో గుళాంబజోన్ డీఐజీ ఎల్‌హెచ్ చౌహన్ పాల్గొన్నారు.