నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 26 (నమస్తే తె లంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెంలో నిర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ మోటర్లు నీటిలో నుంచి తేలాయి. ఈనెల మొదటి వారంలో భారీ వర్షాలతో అడిక్ట్ల గుండా వరద జలా లు ప్రవేశించడంతో పంపుహౌస్ మునిగిపోయింది. దీంతో అప్పటి నుంచి 30 ఫీట్లకుపై గా లోతులో రూ.2,600 కోట్ల విలువైన మో టర్లు నీటిలోనే ఉంటూ వచ్చాయి. అప్పటి నుంచి నీటి తోడివేతను ఇరిగేషన్ ఇంజినీర్లు చేపడుతున్నారు.
మోటర్ల మునకపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిలు వి మర్శించారు. దీంతో స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి వారం కిందట మునిగిన పంపుహౌస్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో 40 మోటర్లతో 20 రోజులకుపైగా నీళ్లను ఎత్తిపోయడం జరిగింది. ముందుగా సర్జిపుల్ నుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు వెళ్లకుండా షట్టర్లను మూసేశారు. కొందరు గజ ఈతగాళ్ల సాయంతో షట్టర్లలో నుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు రాకుండా చేశా రు. ఎట్టకేలకు ఈ మోటర్లు బయటకు తేలా యి. అయితే శ్రీపురం నుంచి పంపుహౌస్ వ రకు 19 కిలోమీటర్ల మేరకున్న టన్నెల్లో నీ ళ్లు నిలిచి ఉన్నాయి.
ప్రస్తుతం తేలిన మోటర్లను శుభ్రం చేయిస్తున్నారు. మోటర్లు, స్విచ్ బో ర్డులను తిరిగి ఎప్పటిలాగే పని చేసేలా పను లు చేస్తున్నామని, చిన్నచిన్న మరమ్మతులు తప్పా పెద్దగా నష్టం కలగలేదని ఈఈ పార్థసారథి తెలిపారు. 15రోజుల్లో మోటర్లను శు భ్రపర్చే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అయి తే టన్నెల్లో నీళ్ల తోడివేత ప్రస్తుతానికి పెం డింగ్‌లో ఉంది. ఈ తోడివేతకూ పక్షం రోజు లు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఏజెన్సీ, అ ధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం తరఫున ఎ లాంటి చర్యలు తీసుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనుల్లో బాధ్యతారాహిత్యం స్ప ష్టంగా కనిపించినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంలో అర్థమేంటోననే సందేహాలు తలెత్తుతున్నాయి.
గతేడాది డిసెంబర్ లో ప్రారంభం కావాల్సిన వట్టెం రిజర్వాయ ర్ పనులు పెండింగ్‌లో పడటమే కాకుండా, ఇలా పంపుహౌస్ ముంపునకు గల కారణాలపై రెండు రోజుల కిందట ఉమ్మడి పాలమూరు పర్యటన చేపట్టిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఇక్కడికి రాకపోవడంపై రైతుల నుం చి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమై న వట్టెం పంపుహౌస్ మునిగితే ముందుగా ఇక్కడ పరిశీలించాల్సింది పోయి అన్నింటినీ హెలీక్యాప్టర్ వేగంతో పరిశీలించిన ఈ బృం దం వట్టెంకు రాకపోవడంలో ప్రాజెక్టుపై బాధ్యతారాహిత్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, పంపుహౌస్‌లో మోటర్లు తేలడంతో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి గురువా రం ఉదయం పరిశీలించారు. నీటి తోడివేత, మోటర్ల పరిశుభ్రతకు చేపట్టిన చర్యలను ఈ ఈని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ మోటర్లకు ఎలాంటి న ష్టం కలగలేదని మీడియాకు వివరించారు.