దేవరకద్రరూరల్(చిన్న చింతకుంట), డిసెంబర్ 23 : ముక్కోటి ఏ కాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుదీరారు. చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సప్తగిరులలోని కాంచనగుహలో కొలువు తీరిన వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీకురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని పునీతులయ్యారు. ఆలయ ప్రాం గణం భక్తుల సందడితో నిండిపోయింది. అలాగే కౌకుంట్ల మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు.
శ్రీరంగాపురం, డిసెంబర్ 23 : మండల కేంద్రంలోని రంగనాథ స్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశా రు. ఉత్తర ద్వారం ద్వారా రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి భ క్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు రంగనాథ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
పాలమూరు, డిసెంబర్ 23 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోనేరు నుంచి గర్భాలయం వరకు క్యూలైన్లలో బారులుదీరి గోవింద నామస్మరణతో స్వా మివారిని కొలిచారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదా నం చేశారు. అలాగే లక్ష్మీవేంకటేశ్వరస్వామిని హైదరాబాద్ హైకోర్టు జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధ ర్మకర్త మధుసూదన్‌కుమార్, ఈ వో శ్రీనివాసరాజు, పర్యవేక్షకులు నిత్యానందచారి, అర్చకులు ఉన్నారు.