అలంపూర్ చౌరస్తా, జూలై 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన్నప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్‌ను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు. బుధవారం సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాల విద్యార్థులు గద్వాలకు జాతీయ రహదారిపై పాదయాత్రగా వెళ్లిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను దిగజార్చుతుందని అన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతి నిత్యం రాజకీయాలు చేసే రేవంత్‌రెడ్డికి గురుకుల విద్యార్థుల గోస కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కనీస వసతులు, సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కే దుస్థితి నెలకొల్పిన దుర్మార్గపు చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆరోపించారు. పిల్లలు పట్టెడు అన్నం, తాగునీటి కోసం అష్టకష్టాలు పడే పరిస్థితి నెలకొందన్నారు.
మాకు న్యాయం కావాలని విద్యార్థులు అన్నందుకు పోలీసులు బలవంతంగా డీసీఎంలో విద్యార్థులను తరలించారని ఇదేక్కడి నాయ్యమని ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అనంతరం గురుకుల పాఠశాలలో మొదట గదులు, మరుగుదొడ్లు, వంట గది, బియ్యం నాణ్యత, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిం చి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అయితే పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రతి రోజూ ఉప్పు నీటినే తాగుతున్నామని, మరుగుదొడ్లు లేక వ్యవసాయ పొల్లాలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నామని, వర్షం వస్తే వర్షపు నీరు గదుల్లో చేరి ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే ముందు వి ద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
దీంతో ఎమ్మెల్యే ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండు చేతులెత్తి మొక్కుతున్నా మీ పిల్ల లు కాదు.. నా పిల్లలను కాపాడండి అని వేడుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను కాంగ్రె స్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పూరితంగా విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర అం టూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు మొదలు పెడుతుందని ముందు గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. పాఠశాలలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని ఎమ్మెల్యే విజయుడు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.