రాజాపూర్, నవంబర్ 18 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బండ్రా రమేశ్‌తోపాటు 30 మంది నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ముస్తా ఫా, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శేఖర్, వెంకటయ్య, నారాయణ, చెన్నయ్య తదితరులున్నారు.
ఆదర్శంగా నిలిచిన తెలంగాణ..
నారాయణపేట, నవంబర్ 18 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధ న్వాడ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది నాయకులు, యువకులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాలు మనుగడ కోసం ప్రభుత్వంపై చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. కొత్తగా చేరిన నాయకులు సమన్వయంతో ప నిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
కష్టపడే వారికి సముచిత స్థానం..
కల్వకుర్తి రూరల్, నవంబర్18 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుర్కలపల్లి సర్పంచ్ ఎల్లయ్య, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి శివకృష్ణతోపాటు పలువురు బీజేపీ నాయకులు 50 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రగిలిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ ఎంపీపీ గోవర్దన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మధు, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్‌రావు, బాలు, నాయకులు మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీను, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలయ్య, లింగం, కిశోర్ పాల్గొన్నారు.