మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 2 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అ డ్డాకుల, కాటవరం గ్రామాల్లో రూ.40లక్షలతో గ్రామ పంచాయతీ భవనాల ని ర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో క లిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం కందూరు జిల్లాపరిషత్ ఉన్నత పా ఠశాలలో విద్యార్థులకు ఆల రఘుపతిరెడ్డి సేవాసంస్థ తయారు చేసిన టెన్త్ గైడ్స్ ను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మాట్లాడారు. సీఎం కేసీఆ ర్ గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంటే.. బీజేపీ పెద్దలు కార్పొరేట్ సంస్థలను పెంచి పోషి స్తూ పేదోడి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. బడా మార్కెట్లను ప్రోత్సహిస్తూ, చిరువ్యాపారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అ డ్డాకుల, మూసాపేట మండలాలకు చెం దిన వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిప త్రం అందజేశారు. 20 ఏండ్ల కిందట ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని ఖా ళీ చేయాలని ఓ వ్యక్తి నోటీసులు ఇచ్చిన ట్లు చౌడాయిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే కు వివరించారు.
తాసిల్దార్‌కు ఫిర్యాదు చేయాలని.. సమస్య పరిష్కారం కాని ప క్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జె డ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీ వో మంజుల, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కందూరు రా మలింగేశ్వరస్వామి ఆలయకమిటీ చైర్మ న్ రమేశ్‌గౌడ్, సర్పంచులు మంజుల, భాగ్యలక్ష్మి, జయన్నగౌడ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.