వనపర్తి, మే 17 (నమస్తే తెలంగాణ) : అతను 36ఏండ్ల్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ సమాజానికి పాఠాలు నేర్పిన పంతులు. కానీ నేడు ఆయనకు తన కొ డుకులు అమానవీయ శిక్ష విధించారు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన తాను తన కుటుంబంలోనూ ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగులుగా, మరొకరు ప్రజాప్రతినిధిగా ఎదిగేలా చేశారు. తన జీవిత భాగస్వామి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందగా నేడు ఆయనకు నాలుగు మెతుకులు పెట్టడానికి కయ్యం ఆడుతున్నారు. చివరకు ఊర్లో కూడా ఉండనివ్వకుండా ఒత్తిళ్లు చేయడంతో ఎట్టకేలకు ఆనాథాశ్రమానికి చేరుకొని సేదతీరున్న ఓ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి చివరి విషాద అంకమిది.
వీపనగండ్ల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన జి. బాలయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఇతడికి నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అందరికీ పెండ్లిళు జరిపించి స్థిరపడేలా చేశారు. ఇతని భార్య సరోజమ్మ అనారోగ్యంతో రెండేళ్ల కిందట మృతిచెందింది. ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ అనంతరం పదేళ్లుగా ఇంటి వద్ద ఉంటున్న బాలయ్యకు కుటుంబ సభ్యుల ఆదరణ కరువైంది. చూడటానికి పెద్ద కుటుంబం, ఇంటి నిండా అయినవాళ్లున్నా ఆదరించేవాళ్లు లేకపోవడంతో తన చివరి అంకం కకవికలమవుతుందని మనోవేదనకు గురయ్యాడు. 85ఏళ్ల వయస్సున్న బాలయ్య మనసు చంపుకొని జీవిస్తున్నాడు.
బాలయ్య సంతానంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ఒకరు విద్యుత్ శాఖలో పనిచేస్తుండగా, మరొకరు ప్రధానోపాధ్యాయుడుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు కూడా జిల్లా పరిధిలోనే పని చేస్తున్నా రు. వీరితోపాటు బాలయ్య మరొక కోడలు ఇటీవల గ్రా మ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. పెద్దకొడుకు మూ డేండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు కొడుకుల కుటుంబాలు గ్రామంలో ఉంటే, మరో ఇద్దరు ఉ ద్యోగ రీత్యా వనపర్తి, పెబ్బేరులో నివాసాలుంటున్నారు. ఇక కూతురు అందరికంటే పెద్ద కావడంతో ముందే వివా హం చేయగా, ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంది.
బాలయ్య చివరిదశ మజిలీ ఒడుదుడుకులతో సాగుతున్నది. ప్రశాంతంగా ఉండనివ్వాల్సిన సమయంలో ఆయనకు క్షణం..క్షణం ఓ నరకమయం అన్నట్లు ఉంది. ఇప్పటికి బాలయ్యకు ప్రభుత్వ పింఛన్ వస్తుంది. బాలయ్యను చేరదీయాలంటే కొడుకుల మధ్య డబ్బు ప్రస్తావన రావడంతోనే పొత్తులో పడ్డాడు.నువ్వు జమ చేసిన డబ్బులన్ని ఇస్తే పెడతాం అంటూ ఒకరిపై ఒకరు వేసుకుంటూ తండ్రి వృద్ధాప్యంతో ఆడుకుంటున్నారు. మాకే ఇవ్వాలంటూ డ బ్బులను సమస్యగా చూపించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు..ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న వారంతా అతడిని వీధిపాలు చేశారు. ఊళ్లో ఓ పనిమనిషిని పెట్టుకొని బతుకు దామ నుకున్నా కాదు.. కూడదంటూ డబ్బుకు ముడిపెట్టి బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల నిరాదరణతో బాలయ్య ఎట్టకేలకు రెండునెలలుగా జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న చేయూత అనాథ ఆశ్రమంలో సేద తీరుతున్నాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న బాలయ్య జీవితగాథను అర్థం చేసుకోనందున పెద్ద సమస్య అయ్యింది. కానీ, బాధ్యతలను తప్పించుకొని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పు వ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన ఆ వృద్ధప్రాయా న్ని ఆశ్రమాల బాట పట్టేలా చేశారు.
పూర్వికుల కష్టార్జితం గ్రామంలో మూడెకరాల పొలం ఉంటే, బాలయ్య కష్టార్జితంతో 23ఎకరాలు చేసి కొడుకులకు పంచి పెట్టారు. ఇంతలా కష్టపడిన ఆయన జీవిత పాఠం చివరి పేజీ కన్నీరుమున్నీరవుతున్నాడు. వయస్సు మీద పడిన కొద్ది కొంత చాదస్తంలాంటి చర్యలుండటం ఎవరికైనా సహజం. అయితే, వాటినే సాకుగా చూపి ఇలా ఆశ్రమాలకు వెళ్లేలా పొగపెట్టడం సమాజానికి గొడ్డలిపెట్టులాంటిది. ఆస్తులు, డబ్బుల పంచాయితీలు ఎన్ని ఉన్నా సామరస్యం గా మాట్లాడుకొని బాలయ్యను ఆదరించాలి. ఇదిలా ఉంటే, వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను శిక్షించేందుకు నూతన చట్టాన్ని ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టి అమలుకు తెచ్చిన సంగతి విధితమే.
నాకు ఎలాంటి కోరికలు లేవు. నా కుటుంబ సభ్యులు ఆదరిస్తే సంతోషం. లేదంటే ఇతరుల సహాయంతోనైనా గ్రామంలోనే ఉండాలన్నది నా ఆకాంక్ష. చిన్న మొక్కలా ప్రారంభమైన నా జీవితం నేడు పెద్ద చెట్టులా మారింది. కొడుకులను ప్రయోజకులను చేశా. నన్ను మాత్రం అనాథను చేశారు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆర్డీవో వద్దకు వెళ్లి నాసమస్య చెప్పాలని ఉంది. మా గ్రామంలోనే నా ప్రాణం పోవాలన్నది నా చివరి కోరిక. – బాలయ్య,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు