శ్రీశైలం, జూన్ 24 : శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగ ట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుదుత్పత్తి చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం హైడల్ ప్రాజెక్టును విద్యుత్‌సౌధ సీఎండీ రుద్వీ, మాజీ సీఎంజీ హెచ్ఆర్ అశోక్‌కుమార్, హైడల్ డైరెక్టర్ వెంకట్రాజన్, సీఎంజీ హెచ్ఆర్ అజయ్లతో కలిసి విద్యుత్ కేంద్రం సర్వీస్ బేస్‌లో పర్యటించారు. నాలుగో యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రెండోసారి యూనిట్ ట్రయల్న్ ఫెయిల్ అవడానికి గల కారణాలను తెలుసుకొని అధికారులపై సీరియస్ అయ్యారు. లోపభూయిష్టమైన సాంకేతిక పరికరాల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే నష్టాన్ని వివరించి అటువంటి పొరపాట్లు జరగకుం డా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కిందిస్థాయి ఉద్యోగుల నుంచి సీఈవో వరకు ఒకే కుటుంబంలా సమిష్టిగా త్వరితగతిన నా లుగో యూనిట్‌ను సిద్ధం చేసి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలన్నారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాలుగో యూనిట్ పునరుద్ధరణకు కావాల్సిన రూ.2 కోట్ల అంచనా వ్యయాన్ని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 2006 లో రికార్డుస్థాయిలో 26వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం సంస్థ సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ ఆదినారాయణ పాల్గొని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సమావేశంలో ప ర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే లు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూ పల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, తుడి మేఘారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు.