మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగు పడినట్లు డీఈ వో రవీందర్ అన్నారు. అడ్డాకుల ఎమ్మార్సీ భవనంలో గురువారం నిర్వహించిన మండలస్థాయి టీచర్ లెర్నిం గ్ మెటీరియల్ ప్రదర్శనకు హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు. సులభ పద్ధతిలో విద్యాబోధన చేసేందుకు బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, ఎంఈవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికితీయాలి
హన్వాడ, డిసెంబర్ 29 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. మండలకేంద్రంలో గురువారం నిర్వహించిన టీఎల్ఎం మేళాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజునాయక్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, హెచ్ఎంలు మురళీకృష్ణ, మదన్మోహన్, భాస్కర్, వెంకటయ్య, దేవిజానాయక్, లక్ష్మయ్య, ఇందిరాదేవి, కిష్టానాయక్, మల్లేశ్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, డిసెంబర్ 29 : మండలకేంద్రంలోని శ్రీవాణి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో గురువారం దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లోని 38 పాఠశాలల ఉపాధ్యాయులు టీఎంఎల్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధనోపకరణాలను తాసిల్దార్ జ్యోతి, ఏఎంవో వెంకట్రామిరెడ్డి తిలకించి ప్రతిభకనబర్చిన వారిని అభినందించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి ప్రసన్నకుమార్, హెచ్ఎంలు అబ్దుల్హాక్, చంద్రకళ, బాలరాం, ఉపాధ్యాయులు సుధాకర్‌రెడ్డి, పురేందర్‌రెడ్డి, తిప్పారెడ్డి, జైపాల్‌రెడ్డి, ఆంజనేయులు, శరత్చంద్ర, కృష్ణయ్య పాల్గొన్నారు.