Dengue | దామరగిద్ద : మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. గ్రామంలో మురికి కాల్వలు, నీరు నిల్వ ఉన్నా వాటిని గుర్తించి తెమోపాస్ స్ప్రే చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి లార్వా సర్వే నిర్వహించారు. డెంగ్యూ కేసు నమోదైన ఇంట్లో పైరెత్రీమ్ స్ప్రే చేసి ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు కుట్టకుండ చూసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కిష్టమ్మ, సూపర్ వైజర్ శంకర్, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎన్ఎం బాలచంద్రమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.