మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 29 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్‌పల్లిలో అక్రమ నిర్మాణాల పేరిట రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇండ్ల్లను కూల్చివేశారు. సర్వే నెంబర్ 523లో ఉన్న 70కి పైగా ఇండ్లను బుల్డోజర్లు, జేసీబీలతో సాయంతో నేలమట్టం చేశారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో మహబూబ్‌నగర్ అర్బన్ తాసీల్దారు, రెవె న్యూ అధికారులు ఈ చర్యలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నేలమట్టం అయిన వాటిలో 25 నిర్మాణాలు దివ్యాంగులు, అంధులకు సంబంధించినవే ఉండటం విశేషం. ఏదిఏమైనా అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలో నిరుపేదలే సమిధలుగా మిగిలారు.
సూత్రధారులను వదిలి..
అక్రమ నిర్మాణాల పేరిట ఇండ్లను కూల్చివేసిన అధికారులు అసలు సూత్రధారులను వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 523లో ఇండ్లు నిర్మించుకున్న వారిలో ఎక్కువగా పేదలే ఉన్నారు. వారిలో చాలా వరకు మధ్యవర్తుల ద్వారా భూమి పట్టాలు కొనుగోలు చేసిన వారుండగా.. కొందరు దివ్యాంగులు ఉన్నారు. సర్వే నెంబర్ 523లో రాత్రికి రాత్రే అధికారులు 75 ఇండ్లను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పట్టాలు సృష్టించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన వాటినే తాము కూల్చివేశామని అధికారులు అంటుండగా.. అందులో 25మంది దివ్యాంగులు కాగా.. 50 మంది
ఇతరులు ఉన్నారు.
వీరిలో చాలా మంది ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేసి పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, కొందరు రెవెన్యూ అధికారుల మద్దతుతో కొందరు దళారులు, మధ్యవర్తులు కలిసి భూ మాఫియాగా ఏర్పడి ఒక్కో ప్లాటు కు రూ.70వేల నుంచి రూ.3.50లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పాలమూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, దళారులు, యూనియన్ల పేరు చెప్పుకుని తిరిగే వారు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగ పట్టాలు సృష్టించడం, మున్సిపాలిటీలో ఇంటి నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవడం, పన్ను చెల్లించడం దగ్గర నుంచి అన్నీ వీరే చూసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పట్టాల వ్యవహారంలో రూ.5కోట్లకు పైగానే చేతులు మారినట్లు తెలుస్తోంది.
గతంలో అనర్హులకు పట్టాలు
523 సర్వే నెంబర్లో 83.28ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా 2,400 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉండటంతో 2017లో అధికారులు విచారణ చేశారు. 586 పట్టాలు సక్రమమని గుర్తించి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారు. 75మంది దివ్యాంగులకు పట్టాలను ఇచ్చారు. మిగతా స్థలాన్ని భూ మాఫియా దొంగ పట్టాలతో విక్రయిస్తోంది. ఈ తతంగం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా.. అధికారులు ప్రతిసారి చర్యలు చేపడతాం.. అక్రమార్కుల పనిపడతాం.. అంటూ మాటలు
కలెక్టరేట్ ఎదుట ధర్నా
సర్వే నెంబర్ 523లో తాము ఎన్నో ఏండ్ల్లుగా నివాసం ఉంటూ మున్సిపాలిటీ ద్వారా ఇంటి నెంబర్లు పొంది, విద్యుత్ మీటర్లు తీసుకొని.. పన్నులు కడుతున్నా.. అధికారులు ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అంటూ బాధితులు గురువారం కలెక్టరేట్ ,ఆదర్శనగర్ కాలనీ బ్లైండ్ లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎదుట హ్యాండీక్యాప్డ్ అసోసియేషన్ నాయకులు, బాధితులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లావాసి సీఎం అవుతున్నాడని సంతోషపడితే దివ్యాంగులపైకి 500 మంది పోలీసులను అర్ధరాత్రి పంపించి కొట్టి.. ఇలా ఇండ్లు కూల్చడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ వస్తోందని అన్నారు. తమ ఇండ్ల్లను కూల్చిన తాసీల్దార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు అర్ధరాత్రి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి
ఎట్లా బతకాలె..
తాము ఎంతో కష్టపడి.. కడుపు మాడ్చుకుని.. ఒక పూట తిని.. మరోపూట పస్తులుండి.. మా ఇద్దరు బిడ్డలకు ఇంత గుడిసె వేసి ఇద్దామని పైసా.. పైసా కూడబెట్టి కట్టిన ఇంటిని అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు.. మేము పూర్తిగా రోడ్డు మీదికొచ్చాం. సామాన్లు లేవు.. మాకు ఇద్దరు ఆడపిల్లలే… ఏడ ఉండాలె.. ఏడ పండుకోవాలే.. పది హేనేండ్లుగా లేనిది.. ఇప్పుడెట్లా కూలకొట్టిండ్రు.. ఇంటి ట్యాక్స్, నల్లా బిల్లు కడుతున్నాం.. అయినా ముందుగా చెప్పాలి కదా’.. అని మరుగుజ్జు, దివ్యాంగులైన భార్యాభర్తలు బోజ్యానాయక్, భామిని కన్నీరు పెట్టుకున్నారు.
ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 29 : గురువారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ పట్టణంలోని సర్వే నెంబర్ 523లో అధికారులు కూల్చివేసిన ఇండ్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా భోజ్యానాయక్, బామిని దీన దుస్థితిని చూసి మాజీ మంత్రి చలించిపోయారు. భోజ్యానాయక్, బామిని మాట్లాడుతూ తమకు దేవుడే అన్యాయం చేశాడంటే.. ఇప్పుడు అధికారులు కూడా మా ఇంటిపై దాడి చేసి బతుకులేకుండా చేశారని వాపోయారు. తమకు ఇద్ద రు ఆడపిల్లలు అఖిల, భానుప్రియ ఉన్నారని, వారి భవిష్యత్‌కు ఏం చేసే పరిస్థితి లేదని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
సర్వే నెంబర్ 523లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే పునరావాసం కల్పించకపోతే తాను ఆమరణ నిరాహార దీ క్షకు అయినా సిద్ధం అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హె చ్చరించారు. దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా మే ం పింఛన్ నాలుగు వేలు చేస్తే వాళ్లేమో ఇండ్లు కూలగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ తరఫున నేను నిరాహార దీక్ష చేస్తానని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.కాళ్లు, కళ్లులేని వారి ఇంటిని కూలగొడతారా.? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరా టం చేస్తుందన్నారు.
ప్రజా సంక్షేమంలో భా గంగా ఈ కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, మి షన్ భగీరథ నీటిని సైతం బీఆర్ఎస్ హ యాంలో అందించామన్నారు. దివ్యాంగుల ఇండ్లు కూలగొడితే వాళ్లు ఎక్కడ ఉంటారో అని కనీస ఆలోచన చేయకపోవడం బాధాకరం అన్నారు. పునరావాసంతోపాటు భోజ న, వసతి సదుపాయం కల్పించాలని డిమాం డ్ చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. దొంగపట్టాలు ఉంటే వీళ్లకు ఇచ్చిన వాళ్లమీద కేసులు పెట్టాలి కానీ పేదలకు అన్యాయం చేయొద్దన్నారు. ప్రభు త్వం పట్టించుకోకపోతే మేం అధికారంలోకి వచ్చాక కూలగొట్టిన చోటే ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
సమాచారం ఇవ్వకుండానే..
సర్వే నెంబర్ 523 ఇండ్ల నిర్మాణాలు కూల్చివేత విషయంపై రెవెన్యూ అధికారులు మాకు సమాచారం ఇవ్వలేదు. బ్లైండ్లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఫిజికల్ హ్యాండ్క్యాస్ట్) రిజిస్ట్రేషన్ నెం. 122/79కి 2001లో 83 ప్లాట్లు అప్పట్లో అధికారులు కేటాయించారు. అంధులు, చెవుడు, మూగ, ఫిజికల్ హ్యాండ్క్యాప్ట్ వాళ్లు ఇండ్ల్లు కట్టుకోవచ్చని చెప్పారు. వాళ్లు ఇచ్చిన లేఅవుట్ ప్రకారమే ప్రస్తుత నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
– ఎల్లయ్య, బ్లైండ్లేమ్ వెల్ఫేర్ గౌరవ సలహాదారు
కూలీకష్టం చేసుకునేటోళ్లం సారూ
గతంలో పట్టాలు ఇస్తామని మా కాగితాలు అన్ని తీసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారయ్యా.! ఇంటి ట్యాక్సీ, కరెంట్ బిల్లు, ఆధార్, ఓటరుకార్డు అన్నీ ఉన్నాయి. అయినా అధికారులు కనికరించలేదు. జీవో నెం.59 కింద సైతం దరఖాస్తు చేసుకున్నాం. మాకు న్యాయం చేయాలి సార్.
– కుర్వ సత్యమ్మ, ఆదర్శనగర్, మహబూబ్‌నగర్
కాళ్లు మొక్కుతామన్నా కనికరించలే..
పేదోళ్లం సారూ.. కాళ్ల్లు మొక్కుతాం అంటే కూడా కనికరించలే.. ఇంట్ల మోటార్ సైకిల్, సామాను ఉండగానే కూల్చేశారయ్యా. ఇప్పటికే మూడుసార్లు విచారణ చేశారు. రెవెన్యూ ఆఫీసోళ్లే వచ్చి ఇంకా ఇంత వరకే కట్టు.. ఆపై కట్టుకోకు.. పక్కలకు జరగకు అని చెప్పిండ్రు.. ఇప్పుడు రాత్రికి రాత్రే కూల్చేశారయ్యా.!
-మిరియాల పద్మ, మహబూబ్‌నగర్
కాంగిరేసు అంటూ తిరుగుతాడు
మా ఆయన కాంగ్రేసేయననే..! మా కాంగిరేసు అంటూ తిరిగాడు.. ఇప్పుడు ఉండనీకే గూడు లేకుండా చేసింది. నా కుడికాలు విరగడంతో రాడ్డేశారు. ఇబ్బంది అయితే నిన్న దవాఖానకు పోయా.. డాక్టర్లు పరీక్షలు చేసిండ్రు.. రిపోర్టులు వచ్చాక ఏం చెబుతారో అని అక్కడే ఉంటి. మీ ఇళ్లు కూలగొట్టిండ్రు అంటూ ఫోన్ రావడంతో ఇక్కడికి వస్తే కన్నీరు ఆగడం లేదయ్యా.. కడుపుమాడ్చుకుని కట్టుకున్నాం.
– ఉప్పరి లలిత, ఆదర్శ నగర్, మహబూబ్‌నగర్
చట్టం ముందు మానమే
సర్వే నెంబర్ 523లో అక్రమాలపై ఫిర్యాదు చేసింది కూడా పేదలే.. పలు దఫాలుగా విచారణ చేసి పరిశీలించి 75తాత్కాలిక నిర్మాణాలు ఎవరూ నివాసం లేని ఇండ్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కూల్చివేశాం. వీటికి ఎలాంటి పట్టాలు రెవెన్యూ అధికారులు జారీ చేయలేదు. కొందరు ఇక్కడ మీరు కట్టుకోండని చెప్పి.. వాళ్లతో డబ్బు లు వసూలు చేసి వారికే అమ్మినట్లు మా దృష్టికి వచ్చింది.