మహబూబ్‌నగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు విద్యా శా ఖలో అవినీతి తిమింగలం లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల కు లంచమిచ్చి తమ కర్తవ్యా న్ని గాలికొదిలేస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి కొందరు ఉ పాధ్యాయలు, సంఘాల నేతలే విద్యాశాఖలో భారీ ఎత్తున అవినీతికి రాచమార్గం చూపించార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు కా వాలని.. సీనియారిటీ రావాలని.. కోరిన చోట ఉ ద్యోగం చేయాలని.. డిప్యూటేషన్‌పై పట్టణాల్లో పనిచేయాలని.. స్కూలుకు డుమ్మా కొట్టినా అడగొద్దని.. ఇలా ఉపాధ్యాయులు అవినీతి అధికారులకు ఆమ్యామ్యాలు ఇచ్చి విద్యా వ్యవస్థను భ్ర ష్టు పట్టించారన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా యి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లోనూ భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారు. నచ్చిన ప్లేస్‌కు రూ.లక్ష దాకా లంచమిచ్చి కోరిన చోటకు జాబ్ వేయించుకున్నట్లు సమాచారం.
ఒక్కో పనికి ఒక్కో రేటు..
మహబూబ్‌గర్ ఇన్చార్జి డీఈవోగా పనిచేసిన రవీందర్ అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ప్రమోషన్లు కావాలంటే రూ.2 లక్షలు, డిప్యూటేషన్ కావాలంటే రూ.లక్ష, సీనియారిటీ జాబితా లో రావాలంటే రూ.1.50 లక్షలు, స్కూలుకు రా కుండా డుమ్మా కొట్టిన టీచర్లు రూ.15,000, కే జీబీవీ స్కూళ్లలో చేయకుండా ఉండడానికి ఒక్కో స్కూల్ నుంచి రూ.10,000 ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు బయటపడింది. జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో లెక్చరర్‌గా ప్రమోషన్ తీసుకొని ఏకంగా డీఈవోగా చలామణి అవుతున్నారు రవీందర్.. ఆయన అవినీతి చిట్టా ఏసీ బీ అధికారులకు దొరికిపోయిందని తెలుస్తోంది. డీఈవో ఇంటిపై దాడి చేసిన సమయంలో కీలక డాక్యుమెంట్లు లభించాయని.. ఇందులో లంచా లు ఇచ్చిన వారందరి పేర్లు.. వివరాలన్నీ ఉన్నట్లు సమాచారం.
దీన్ని ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ సమాచారం మొత్తం ఉన్నతాధికారులకు చేరవేస్తుడటంతో ఉపాధ్యాయుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తన భార్యకు ఇంటి సమీపంలోని ఒక స్కూల్లో డిప్యూటేషన్ ఇచ్చిన ట్లు తేలింది. ప్రైవేటు పాఠశాలలను తన గుప్పిట్లో పెట్టుకుని ఏకంగా మూడు పాఠశాలల్లో పార్ట్నర్షిప్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యా వ్యవస్థ రాష్ర్టానికి ఆదర్శంగా ఉండేది. అలాంటిది ప్రస్తు తం అవినీతి మయంగామారింది. తమకు నచ్చినట్లు ఉండే అధికారులను మచ్చిక చేసుకుని లం చాలు ఇస్తుండడంతో ఇలాంటి తిమింగలాలు రె చ్చిపోతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్ విద్యా శాఖను ప్రక్షాళన చేయకపోతే విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. చాలా చోట్ల సరైన స మయానికి బడులు నడవడం లేదు. ఈ విష యం మీడియాలో వచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇందుకు కారణంగా ఇలాంటి అ వినీతి అధికారే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బదిలీల్లో భారీ అక్రమాలు
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ అధికారిని ప్రసన్నం చేసుకున్న టీచర్లు నచ్చిన స్థానానికి వెళ్లడానికి ఏకంగా రూ.లక్ష చెల్లించినట్లు బయట ప డింది. దీనిపై విచారణ జరిపితే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా.. నచ్చిన ప్లేస్‌కు పంపకుండా కావాలనే ఇబ్బందుల పాలు చేశారని పలువురు వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటేషన్లను రద్దు చేశారు. అత్యవసరమైతే తప్పా ఇవ్వొద్దని.. అది కూడా కలెక్టర్ల అనుమతి ఉంటేనే అని ఆదేశాలున్నా.. వీటిని డీ ఈవో తుంగలో తొక్కి అంతా తానై నడిపించా రు. డిప్యూటేషన్లపై ఉన్న అందరినీ విచారిస్తే అస లు విషయం బయటపడే అవకాశం లేకపోలేదు. తన భార్యకు డిప్యూటేషన్ ఇవ్వకుంటే ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో.. ఏకంగా ఇంటికి సమీపంలోని పాఠశాలకు మార్చడం గమనార్హం.
కవర్‌తో వెళ్లాల్సిందే!
డీఈవోగా బాధ్యతలు చే పట్టిన నాటి నుంచి రవీంద ర్ తీరు వివాదాస్పదంగానే ఉన్నది. కానీ ఈ పదవిలోకి రావడానికి అధికారులకు లంచం ఇ చ్చి వచ్చానని.. తాను తీసుకుంటే తప్పేంటని ఇం టికి వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడి ముందు వాపోయేవాడట. ఇదే అదనుగా ఉపాధ్యాయ సంఘా లు, ఆఫీసులో పనిచేసే కొంతమంది సిబ్బంది ఆ యనకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పని కావాలన్నా సదరు టీచర్ అధికారి ఇంటికి కవర్‌తో వెళ్తే.. చాలు అ క్కడి నుంచే ఆఫీస్ ఇబ్బందికి ఆదేశాలు వెళ్లేవట. ఫైల్ టేబుల్ మీద ఉండేదట.. ఏం తెలియనట్లు ఆర్డర్ తీసుకొని వెళ్లాల్సిందే. తీసుకున్న డబ్బులకు ఈ రకంగా న్యాయం చేస్తుండడంతో ప్రతిరోజు ఆయన ఇంటి ముందు ఎందరో ప్రత్యక్షమయ్యేవారట. స్కూల్‌కు డుమ్మా కొట్టి మరీ పని చేయించుకొని వెళ్లేవారట.
రూ.50 వేల అడ్డంగా..
ఓ స్కూల్ టీచర్‌కు ప్రమోషన్ రాలేదు. తనక న్నా జూనియర్‌కు ప్రమోషన్ రావడంతో సదరు టీచర్ డీఈవోను కలిసింది. దానికి ససేమెరా అన గా.. చివరకు రూ.2 లక్షలకు బేరం కుదిరింది. రూ.1.50 లక్షలు ఆ టీచర్ తన ఇంటికి పిలిపించి ఇవ్వగా.. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయి తే సదరు టీచర్‌ను కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చి అక్కడి నుంచి ఆర్డర్ తీసుకోవాల్సిన డబ్బులు ఇ వ్వందే పనిచేయలేదు. అయితే కార్యాలయ సూ పరింటెండెంట్కు పురమాయించి ఈ ఫైల్ మొ త్తం రెడీ చేశారు. కానీ సంతకం మాత్రం డబ్బులిస్తేనే పెడతానని చెప్పడంతో సదరు టీచర్ ఏసీబీని ఆశ్రయించింది. వారి సూచన మేరకు గురువారం ఉదయం ఇంటికెళ్లి రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు సంబంధిత ఫైల్‌ను తెప్పించారు. అంతా రెడీ చేశాక సంతకం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు.
ప్రైవేట్ స్కూళ్లల్లో భాగస్వామిగా..
జిల్లా కేంద్రంలోని ప్రముఖ పాఠశాలలో కూ డా డీఈవో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇక్కడే తిష్టవేసి ప్రతి అధికారిని తన కనుసన్నల్లో పెట్టుకుని.. అంతా ఆయన చేతుల్లోనే నడిపే వారని సమాచారం. ఫిర్యాదులు వచ్చినా చర్యలు మాత్రం శూన్యం. దీన్ని ఆసరాగా చేసుకొ ని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకుగానూ నజరానాగా స్కూల్ యాజమాన్యం పార్ట్నర్షిప్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోం ది. దీంతో మూడు, నాలుగు పాఠశాలల్లో భా గస్వామిగా ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలే అంటున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు ఆయన అండచూసుకొని రెచ్చిపోయినట్లు ఆరోపణలున్నాయి. భారీగా ఫీజుల వసూలు, వసతులు కల్పించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ వంటి ఫిర్యాదులు అందినా బుట్టదాఖలుగా మారాయి. కలెక్టర్ చొరవ తీసుకొని డిప్యూటేషన్లు రద్దుచేసి బదిలీల్లోని అవినీతి, అక్రమాలను వెలికితీయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.