కొల్లాపూర్, మే 3 : దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దేశ మూలవాసులైనా అడ వి బిడ్డలకు స్వాతంత్య్రం రాలేదు. సమాఖ్య పాలనలో రాష్ట్రంలోని చెంచుల ఉనికిపై ప్రభుత్వాలు దెబ్బకొడితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెంచులను కడుపులో దాచుకున్నది. అనేక సంక్షేమ పథకాలను చెంచు పెంటలకు చేర్చడంతో పా టు వారి ఉపాధికి భరోసా కల్పించింది. కానీ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పాలన రా వడంతో చెంచుల పరిస్థితి మళ్లీ పూర్వస్థితికి నెట్టివేయయబడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీ ప్రాంతంలోని చెంచులకు మాత్రం ఇందిరమ్మ ఇండ్లు అందని దాక్షలాగే మిగిలిపోయాయి.
ఆర్థిక స్థోమత లేక పునాదులకు నో చుకొని కొల్లాపూర్ చెంచుల గురించి నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథ నం.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి, భ్రమరాంబ కాలనీ, మొలచింతలపల్లి చెంచు గూడెం, ఎల్లూరు చెంచు గూడెం, నార్లాపూర్ చెంచు గూడెం, తీర్నాంపల్లి, గుండ్లపెంట, లింగమయ్య పెంట తదితర చెంచు పెంటల్లో చెంచులు వందలాదిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెంచులపై ప్రత్యే క దృష్టి పెట్టిన ప్రభుత్వం ఐటీడీఏతో అనేక సంక్షేమ పథకాలను వారి దరికి చేర్చింది.
వారి ఉపాధి ని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా చేపల బోట్లు, చేపల కంపెనీ, వలలతో పాటు ఇ తర పనిముట్లను అందించింది. స్వ చ్ఛంద సంస్థలు చెంచుల కోసం పక్క గృహాలను నిర్మించేందుకు వచ్చే విధంగా సహకారం అందించింది. ఎన్నికల ముందు అందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెం చులకు మొండిచేయ్యి చూ పిందని గిరిజన సం ఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గిరిజన సంఘాల ఆరోపణాలకు బలం చేకూర్చేలా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెంచుల చెంతకు ఇంత వరకు ఇందిరమ్మ ఇండ్లకు పునాది పడలేదు.
ఆర్థిక స్థోమత పునాదికి అడ్డంకి
ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా ఆ నిర్మాణానికి పునాది వేసే కనీస ఆర్థిక స్థోమత చెంచుల వద్ద లేదు. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్ల కింద ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులు అడవుల్లో ఉండే చెంచులకు ఏమాత్రం సరిపోవు. చెంచు పెంట ల్లో ఇండ్ల నిర్మాణం మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే అదనపు భారం అవుతోంది. ఎలాంటి ఉపాధికి నోచుకొని చెంచుల పూట గడవడమే కష్టంగా ఉంటే పునాది గురించే ఆలోచించే శక్తి చెంచులకు లేదని బాధిత చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కరకు రాని ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్
పేరుకు మాత్రం ప్రభుత్వం చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసినట్లు ప్రొసీడింగ్స్‌ను అందించి చేతులు దులుపుకొన్నది. మాకు ఇల్లు ఇచ్చామని కాగితం ఇచ్చి కాగితాల్లో రాసుకున్నారు. కానీ ఆ ఇంటికి పునాది వేసే శక్తి కూడా తమ వద్ద లేదని కాగితాలు ఇచ్చిన సార్లు తొందరగా ఇళ్ల ను కట్టుకోవాలని లేకపోతే వెనక్కి వెళ్తాయని చెప్పుతున్నారని, మాకు ఇళ్లు కట్టుకునే శక్తి లేదు, ఇళ్లు కట్టుకునేందు కు మాకు ఎవరూ అప్పు ఇవ్వరు, మేం ఇళ్లు కట్టుకోలేము, మాకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కాగితాలు నాలుక గీసుకునేందు కు కూడా పనికిరావని అమరగిరి చెంచులు పేర్కొంటున్నారు. అమరగిరి చెంచు గూ డెంలో 14ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే దానిలో ఒక్క ఇందిరమ్మ ఇంటికి కూడా పునాది పడలేదు.
చెంచులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
చెంచుల వంటి అత్యంత వెనకబడిన గిరిజన తెగల (పీవీటీజీఎస్) విషయంలో సాధారణ నిబంధనలు వర్తింపజేయడం సరైనది కాదు. చెంచులకు ఎలాంటి అప్పుభారం లేకుండా పూర్తిస్థాయి ప్రభుత్వ వ్యయంతోనే ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. పని ప్రారంభం కం టే ముందే చెంచులకు ఇండ్ల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేయాల్సి ఉన్నది. ప్రభుత్వమే కాంట్రాక్ట ర్ వ్యవస్థ ద్వారా ఇళ్లను నిర్మించి చెం చులతో గృ హ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ఐటీడీఏ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేయించి ఇందిరమ్మ ఇండ్ల ను కూడా పూర్తి చే యించవాల్సిన బా ధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నదని చెంచు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చాం పని పూర్తి అయిందనే ధోరణిలో ఉన్నట్లు తె లుస్తోందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. అడవిని కాపాడే చెంచులకు ఎన్నికల హామీ ఇచ్చి న విధంగా ఒక పక్కా ఇళ్లు ఇవ్వలేకపోవడం కాంగ్రె స్ వైఫల్యంకు అద్దం పడుతోంది. తెలంగాణ ప్ర జానీకాన్ని మోసం చేసిన విధంగా అడవి చా టున బతికే అమాయక చెంచులను కూ డా ప్రభుత్వం మోసం చేసినట్లు ఆచరణలో తెలుస్తోందని మానవ హ క్కుల సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.