జడ్చర్లటౌన్, మే 1 : 69వ జాతీయస్థాయి అండర్-17 క్రికెట్ టోర్నీ విజేతగా ఢిల్లీ జట్టు నిలిచింది. శుక్రవారం జడ్చర్ల మినీస్టేడియం మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుపై ఢిల్లీ జట్టు విజయం సా ధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ద్వితీయ స్థానం లో తమిళనాడు, తృతీయ స్థానంలో ఉత్తర్ఖాండ్ జట్లు నిలిచాయి. ఏప్రిల్26వ తేదీ నుంచి జడ్చర్ల, మహబూబ్‌నగర్ వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 69వ జాతీయస్థాయి అండర్-17బాలుర జాతీయస్థాయి టో ర్నమెంట్ ప్రారంభం కాగా ఈ పోటీల్లో దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 31జట్లు పాల్గొన్నాయి.
మొదటగా లీగ్మ్యాచులు, నాకౌట్ మ్యాచులు జరిగాయి. వీటి లో గెలిచిన జట్లు ఫ్రీక్వార్టర్, క్వార్టర్‌ఫైనల్ మ్యాచులు ఆడాయి. చివరగా ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర్ఖాండ్, డీఏసీ సీఏంసీ సెమీఫైనల్స్ మ్యాచులు ఆడాయి. వీటిలో ఢిల్లీ, తమిళనాడు జట్లు ఫైనల్‌కు చేరుకొని ఆడాయి. చివరగా హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన తమిళనాడు జట్టు 20ఓవర్లలో 7వికెట్లు కో ల్పోయి 142పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున తమిళ్ సెల్వమ్ 36 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 19.1ఓవర్లలో 5 వికెట్లు కో ల్పోయి 148 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
జాతీయస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన విజేత జట్లకు మహబూబ్‌నగర్ డీఈవో ప్రవీణ్‌కుమార్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడుతూ జాతీయస్థాయి క్రీడలకు మహబూబ్‌నగర్ జిల్లా వేదిక కావటం ఎంతో గర్వకారణమన్నారు. ఆటలు ప్రతిఒక్కరి జీవితంలో భాగమవ్వాలని సూచించారు. జాతీయస్థాయి టోర్నమెంట్లో రాణించిన క్రీడాకారులు భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్పర్సన్ సారిక, ఎంఈవో మంజులాదేవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి, పీడీ, పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుమార్ల నిరంజన్, ఎఏంవో శ్రీనివాస్, సీఎంవో సుధాకర్, ఎస్జీఎఫ్ పరిశీలకులు సంజయ్‌కుమార్, నిర్వాహకులు మొయిన్, కృష్ణ య్య, రాంరెడ్డి, ఆనంద్‌కుమార్, రాములు, భానుకిరణ్, ఉమాదేవి, నిర్మల, సుగుణ, సోమ్లనాయక్, శంకర్, వివిధ రాష్ర్టాల కోచ్‌లు,క్రీడాకారులు పాల్గొన్నారు.