మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 29 : కేసీఆ ర్ దీక్ష చేయడం వల్లే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ప్రకటించిందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన ఉద్యోగ సహచరులతో కేసీఆర్‌కు అండగా నిలిచామని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనకు చేపట్టిన ఉద్యమంలో కేసీఆర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అంతకుముందు ఆర్అండ్బీ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ అన్ని రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు, అధ్యక్షులు వేర్వేరుగా ఉన్నా మన రా ష్ర్టానికి అధ్యక్షుడు, తెలంగాణ తెచ్చిన కేసీఆరే ము ఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. మిగతా పార్టీల చరిత్ర వేరు, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర వేరని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందరో నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పదేండ్లు అన్ని అనుభవించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీ మారారని, అలాంటి నాయకులు, కార్యకర్తలకు దూరంగా ఉం డాలని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రూ.4 వేల పింఛన్, రైతుబంధు, రైతుబీమా ఇవ్వకుండా రైతు సంబురాలు నిర్వహిస్తున్నారని వి మర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హాస్టల్లో సీ ట్ల కోసం విద్యార్థులు పోటీపడేవారని, నేడు హాస్టల్ వదిలి వెళ్లేందుకు పోటీపడుతున్నారని ఆరోపించా రు. కేసీఆర్ ప్రభుత్వంలో సన్నబియ్యంలో భోజనం వడ్డిస్తే, నేడు పురుగుల అన్నం పెడుతున్నారన్నారు. టిఫిన్ బాక్స్‌లతో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బాగుండేది అనే విధంగా ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలవుతుందన్నారు.
Mbr01
ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమం లో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, మహబూబ్‌నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సుధాకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్ర త్యేక రాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజే దీక్షాదివస్ అని అన్నారు. కేసీఆర్ ప దేండ్ల పాలనలో రా ష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నా రు. 50 ఏండ్లుగా జి ల్లా సాగు, తాగునీరు కు ఎంతో గోసపడిందని, తెలంగాణ వచ్చాక బీళ్లన్నీ సాగుభూములుగా మారాయన్నారు. ఐటీ రంగంలో కూడా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని ఆయన వివరించారు. కేసీఆర్ దీక్షను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం అసమర్థతను ఎప్పడికక్కడ ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగానే రా ష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రక్తపు మరకలేకుండా తెలంగాణ కో సం అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. కాం గ్రెస్ పార్టీ 50 ఏండ్లలో చే యలేని అభివృద్ధి కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి అందించలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 200 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వె య్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని, కా ర్యకర్తలు అధైర్యపడొద్దని, మీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు.
ఉద్యమ కాలంలోనే కేసీఆర్ అభివృద్ధి గురించి ఆ లోచించేవారని, అందువల్లే పదేండ్లలో సాధించిన అభివృద్ధితోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరిందని దే వరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆ ల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొ న్నారు. కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించారు..? ఎంత అభివృద్ధి చేశారు..? అనే దానిపై నిత్యం నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందించి ఓట్లడుగుతామని కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మూడేండ్లలోనే మిషన్ భగీరథ పూర్తిచేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా ప్రజల దరిచేరలేదన్నారు. రైతుల కో సం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ నీరు గార్చి ఇబ్బందుల పాలుచేసిన కాంగ్రెస్ పై రైతులు తిరగబడే రోజులొచ్చాయన్నారు.