మరికల్ : కాంగ్రెస్ పార్టీ (Congress party) అవినీతిలో కూరుకుపోయిందని, ఆరు గ్యారెంటీల ( Six guarantees) పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మరికల్ మండల ఇన్చార్జి ఉమేష్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.
గురువారం మరికల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు.మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడిగా మంగలి వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా రాధా, ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు, కురుమన్న, ప్రధాన కార్యదర్శులుగా రమేష్, సురేందర్ గౌడ్, కార్యదర్శులుగా స్వాతి, దేవేందర్ గౌడ్, చంద్రమ్మ, రఘు గౌడ్, కోశాధికారిగా అశోక్ గౌడ్ లతోపాటు 42 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తిరుపతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఆంజనేయులు, దేవేందర్ రెడ్డి, వివిధ మోర్చాల నాయకులు వడ్డే శ్రీరామ్, వెంకటేష్, మహేందర్ శెట్టి, సురేందర్ గౌడ్, నాయకులు రాజేష్, రమేష్, దేవేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.