మహబూబ్నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 1 : విద్యార్థులకు ఈ నెలలో సెలవులే సెలవులు. ఈనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 13 రోజులపాటు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించగా.. 15న తిరిగి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. బు ధవారం గాంధీ జయంతి కాగా.. దసరా సెలవులు ముగిసిన తర్వాత మళ్లా ఇదే నెలలో దీపావళి పండుగకు సెలవులు రానున్నాయి. సెలవులు ప్రకటించడం తో విద్యార్థులు ఉత్సాహంగా ఇంటిబాట పట్టారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులు వచ్చి ఇండ్లకు తీసుకెళ్లారు. దీంతో బస్టాండ్లు, బ స్సులు, ప్రైవేట్ వాహనాలు కిటకిటలాడాయి. సరిపడా బస్సుల్లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాగులు, లగేజీలు తీసుకెళ్లేందుకు నరకయాతన పడ్డారు. బతుకమ్మ, విజయ దశమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యా రు. కాగా స్కూళ్లల్లో చివరి రోజు విద్యార్థులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బతుకమ్మలు సిద్ధం చేసి ఆడిపాడారు.
గురుకులాలు, వసతిగృహలు, పాఠశాలల్లోని వి ద్యార్థులపై ఆయా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చనున్నారు. దసరా సెలవుల నేపథ్యంతో పదో తరగతి విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించేలా పాఠశాల వి ద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకున్నారు. రోజూవారి షె డ్యూల్కు అనుగుణంగా విద్యార్థులు చదువుకోవడం, రాసుకోవడం, అసైన్మెంట్లు, ఇతర ప్రాజెక్టులు పూ ర్తి చేసేలా ప్రణాళికలతో ముందుకు సాగనున్నారు. పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు కచ్చితంగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగేలా విద్యార్థులకు ఇప్పటికే సూచనలు చేశారు. ప్రధానంగా నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పుస్తక పఠనంపై దృష్టి సారించేలా.. తల్లిదండ్రులతో నిత్యం సంభాషించేలా అధికారులు సిద్ధమయ్యారు.