వనపర్తి,ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఈమేరకు గురువారం బృందంలోని 8 మం దిని అరెస్ట్ చేసి వీరి నుంచి 26 సెల్ఫోన్లు, 22 సిమ్‌కార్డులు, 5 బైక్‌లు, రూ.85 వేల నగదును స్వాధీ నం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ రాందాస్ తేజావత్ ఆధ్వర్యంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
గతనెల 11వ తేదీ కొత్తకోటకు చెందిన కుమ్మరి రాజు ఆన్లైన్లో తాను మోసపోయానని పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రాజు గత జనవరిలో ఆన్లైన్లో ముద్ర విశ్వకర్మ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ. 12, 250 పంపిస్తే, మీకు రుణం మంజూరవుతుందంటే నమ్మి డబ్బులు వేశాడు. మళ్లీ రూ.9వేలు వేస్తేనే రుణం వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరస్తులను గుర్తించడంలో పెద్దమందడి మండలం జంగమాయిపల్లికి చెందిన కురుమూర్తిని ముందు గా అదుపులోకి తీసుకున్నారు.
అతని నుంచి అసలు సూత్రధారిగా వ్యవహరించిన వనపర్తిలో ఉండే నర్సింగ్ నాయక్‌ను గుర్తించారు. ఇతని ఆధ్వర్యంలోనే జిల్లా కేంద్రంలో ఓ రూంను అద్దెకు తీసుకొని మరో ముగ్గురు రాత్లావత్ రమేశ్, ఇస్లావత్ రాములు, కొత్తపల్లి ఉమేశ్, బోయ వీరేశ్లతోపాటు మరో ఇద్దరు మైనర్లను ముఠాగా ఏర్పాటు చేశాడు. నర్సింగ్ నాయక్ బీహార్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి ద్వారా ముద్ర, ధనిలోన్ యాప్‌ల నుంచి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమాచార లిస్ట్‌ను సేకరించాడు.
ఈ లిస్ట్‌లో ఉన్న వారికి ఫోన్లు చేయించి రుణాలు మంజూరు చేస్తామని నమ్మించి, వివిధ రకాల రుసుముల పేరుతో డబ్బు లు వసూలు చేశారు. ఇలా వెయ్యి మంది వరకు ఈ ముఠా సభ్యులు ఫోన్లు చేయగా, 250మంది బాధితులు రూ.20 లక్షల వరకు సైబర్ నేరస్తులకు చిక్కి నష్టపోయారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు మొదలుకుని రూ.40 వేల వరకు బురిడీ కొ ట్టించారు. వచ్చిన డబ్బులను వాటాల వారీగా పం పకాలు చేసుకున్నారు.
ఈ కేసును జిల్లా సైబర్ సె క్యూరిటీ డీఎస్పీ ఎన్బీ రత్నం, కేవీఎం ప్రసాద్, డీఎస్పీ వెంకటేశ్వరావు, కొత్తకోట సీఐ రాంబాబు, కొత్తకోట, వీపనగండ్ల, శ్రీరంగాపూర్ ఎస్సైలు మం జునాథ్ రెడ్డి, నందీకర్, వెంకటేశ్వర్లు, సైబర్ సెక్యూరిటీ ఎస్సై ప్రియదర్శిని ఛేదించారని వీరందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఎస్పీ గిరిధర్ చె ప్పా రు.
కాగా, నేరస్తుల నుంచి రూ.10 లక్షల విలు వ చేసే ఫోన్లు, బైక్‌లు, రూ.85వేల నగదును స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మవద్దన్నారు. అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండే వాట్సాప్ మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.