తిమ్మాజిపేట, నవంబర్ 19 : నాగర్కర్నూల్లో ఆదివారం సాయంత్రం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ టీవీ యాంకర్లు బిత్తిరి సత్తి, సావిత్రీల ఆటాపాటలు, మాటలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గత పదేండ్ల్లలో చేసిన అభి వృద్ధి, పథకాలను వారు తమ యాసతో చక్కగా వివరించారు. కేసీఆర్ మరోసారి ఎందుకురావాలో వారు తెలియజేశారు.