కొల్లాపూర్, ఫిబ్రవరి 4 : ఈ యాసంగి సీజన్లో వరి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. కృష్ణానది నీటిని ఎంజీకేఎల్ఐ ద్వారా నాలుగు వారాల కిందట మోటర్లు పంపింగ్ చేసి ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు తరలించారు. అయితే, ఆయా రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చె రువులు, కుంటలను మొక్కుబడిగా నింపారు. మూడు వా రాలుగా ఎంజీకేఎల్ఐ కాల్వలో నీళ్లు పారడంలేదు. వానకాలంలోనూ కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాకపోవడంతో నీటి మట్టం పెరగలేదు. దీంతో రెండు వా రాలుగా ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులో మోటర్ల పంపింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యం లో గతేడాది కంటే ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గేటట్లు కనిపిస్తున్నది. చె రువులు, కుంట ల్లో నీరు అం తంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నీళ్లు వచ్చే వేసవిలో పశువులకు దాహం తీర్చనున్నదని రైతులు చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితో వరి సాగు చేస్తే మూగజీవాలకు దాహం తీర్చడం కూడా కష్టంగా మారుతుందంటున్నారు. గత యా సంగిలో కొల్లాపూర్ డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలో 30 వేల పైచిలుకు ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం 27 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. అయితే ప్రస్తుతం కొల్లాపూర్ మండలంలో 7 వేల ఎకరాల్లో వరి సాగు కానున్నదని అధికారులు చెబుతున్నారు.
ఎల్లూరు రిజర్వాయర్ కింద 800 ఎకరాలు ఆయకట్టు, సింగవట్నం రిజర్వాయర్ ఆయకట్టు కింద ఏడు గ్రామాల పరిధిలో నాన్ ఆయకట్టు కలుపుకొని 4 వేల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పుడు మా త్రం మొదటి ఆయకట్టు కింద సింగవట్నం, జావాయిపల్లి రైతులు మాత్రమే వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలో అక్కడక్కడా చెరువుల కింద వరి నా ట్లు పెడుతున్నారు. పెంట్లవెల్లి మండలంలో 2 వేలు, కోడేరులో 8 వేలు, పెద్దకొత్తపల్లి మండలంలో 10 వేల ఎకరా ల్లో వరి సాగు కానున్నదని అధికారుల అంచనా. ప్రస్తుతం నీటి లభ్యత లేకపోవడంతో యాసంగి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక పక్క కృష్ణానదిలో నీరు అడుగంటిపోవడం, చెరువులు, కుంటల్లో అంతంత మాత్రంగానే నీరు ఉండడంతో అధికారుల అంచనాలు తలకిందులు కానున్న ట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కొల్లాపూర్ డివిజన్ మొత్తంలో ఈ యాసంగిలో 15 వేల ఎకరాల్లోపే వరి సాగు కానున్నది. సుమారు 12 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గనున్నదని రైతులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.
యాసంగి పంట సీజన్ పూర్తయిన తరువాత బియ్యం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ముందుగానే నదిలో అడుగంటిన నీరు.. ఈ వానకాలంలో కృష్ణానది కూడా పూర్తి స్థాయిలో నిం డకపోవడం, దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా సాగర్‌కు నీరు విడుదల కావడం, అలాగే ఎగువన సంగమేశ్వరం సమీపంలో పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల నుంచి నదీ జలాలను రాయలసీమకు తరలించుకుపోవడంతో నది అ డుగంటిపోయింది. ఐదారేండ్లలో ఇలాంటి పరిస్థితులు కృ ష్ణానదికి దాపురించలేదు. నదిలో ఇప్పుడున్న నీటి పరిస్థితి వాస్తవంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో వరి సాగుపై రైతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది.