మూసాపేట, మార్చి 23: మండలంలోని వేముల, చక్రాపూర్‌లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్‌కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. వేముల, చక్రాపూర్‌లో మొత్తం 420 ఎకరాల వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఇంకా దాసరిపల్లి, చెన్నంపల్లి, నందిపేట, మూసాపేట, తుంకినీపూర్, అచ్చాయిపల్లి, సంలకమద్ది, కొమిరెడ్డిపల్లి, జానంపేట, పోల్కంపల్లి, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో అధికారులు పంటనష్టంపై అంచనా వేయాల్సి ఉన్నది.
అదేవిధంగా పండ్ల తోటలపై కూడా ఇంకా అధికారులు అంచనా వేయాల్సి ఉంది. మూసాపేట మండలంలోని ఆయా గ్రామాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి ఉంటుందని రైతులు చెప్పే మాటలను బట్టి తెలుస్తున్నది. అధికారులు పంట నష్టంపై అన్నీ గ్రామాల్లో పర్యటించి ఆరా తీస్తారా.. లేదంటే మమా అని సరిపెడుతారో వేచి చూద్దాం..
భూత్పూర్, మార్చి 23: మండలంలో ఆదివారం సా యంత్రం వడగండ్ల వాన జోరుగా కురిసింది. వానకు పం టలు బాగా నష్టపోయాయి. మద్దిగట్ల, వెల్కిచర్ల, పాతమొల్గర, కప్పెటలో ఈదురుగాలికి విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. భూత్పూర్లో నీళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.