ధన్వాడ, మార్చి 12: రోజురోజుకు వేసవి తాపం పెరుగుతుండడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతన్నలకు కన్నీరే మిగులుతుంది. మండలంలోని మందిపల్లిలో రైతులకు భూగర్భజలాలు లేక పోవడం, కొత్తగా బోర్లు వేసినా నీరు పడకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. మందిపల్లికి చెందిన రైతు బడుగు కురుమూర్తి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వరిపంటను సాగు చేశాడు.
బోరు ఎండిపోవడంతో ఎకరం వరిపంట ఎం డింది. ఉన్న పంటను కాపాడుకోవడానికి రూ.లక్షా 45వేలు ఖర్చు చేసి 520 ఫీట్ల లోతు కొత్త బోరు వేసినా.. నీరు పడకపోవడంతో రైతు కన్నీ రు పెడుతున్నాడు. యాసంగికి ముందు బోరులో పుష్కలంగా నీరు ఉండడంతో పంటను సాగు చేశాడు. తీరా ఎండలకు బోరులో నీరు ఇంకి పోవడంతో పంట ఎండి మానసిక క్షోభకు గురయ్యారు. ప్రభుత్వం పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. వరి పంటను సాగు చేశా. బోరులో నీటి మ ట్టం తగ్గడంతో ఎకరా పొలం ఎండిపోయిం ది. ఉన్న పంటను కాపాడుకోవడానికి ఇటీవల రూ.లక్ష 45వేలు ఖర్చు చేసి 520 ఫీట్ల లోతు కొత్త బోరు వేశా. అయినా నీరు పడలేదు. పెట్టుబడికి రూ.50 వేలుకలుపుకొని మొత్తం రూ.2లక్షలు పెట్టినా పంటను కాపాడుకోలేకపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎండిన పంటను చూస్తే కన్నీరు వస్తోంది. – బడుగు కురుమూర్తి, రైతు, మందిపల్లి,
-ధన్వాడ మండలం, నారాయణ పేట జిల్ల్లా