ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురియడంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపడ్డాయి. కల్లాలు, రోడ్లు, మార్కెట్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న, పొగాకు తడిసి ముద్దయ్యాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజోళి మండలకేంద్రంలో ఓ ఇంటి గోడ కుప్పకూలగా కొన్ని ప్రాంతాల్లో రేకులషెడ్లు, డబ్బాలు గాలి ఎరిగిపడ్డాయి.
– నెట్వర్క్, ఏప్రిల్ 20
నాగర్‌కర్నూల్/రూరల్/మానవపాడు/ రాజోళి/ చారకొండ/ఊర్కొండ/అమ్రాబాద్/ మల్దకల్/ కొ ల్లాపూర్ రూరల్/బిజినేపల్లి/తిమ్మాజిపేట/ గోపా ల్పేట/పెద్దమందడి/పాన్‌గల్/తాడూరు, ఏప్రిల్ 20 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో కోతకోసి నూర్పిడి చేసి రోడ్లపై ఆరబెట్టిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిముద్దయ్యాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో వ్యవసాయ మార్కెట్లో తూకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. చిన్నపాటి గాలితో ప్రారంభమైన వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్లో ఆరబెట్టిన ధాన్యమంతా అకాల వర్షానికి నీటిపాలైంది. మానవపాడులో మోస్తరు వర్షం కురిసింది. కల్లాల్ల్లో ఆరబోసిన మిరప తడిసి ముద్దయ్యింది.
ఆరబోసిన మిరపను టార్పాలిన్ కవర్లతో కప్పేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులపై అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు వాపోయారు. రాజోళి మండల కేంద్రంలోని పునరావాస గృహాల్లో భారీగా వీచిన గాలికి ఇంటిగోడ కూలింది. రాజోళి న్యూ ప్లాట్స్‌లో జయరాములు కుటుంబం అద్దెకు ఉండగా, సాయంత్రం గాలి విపరీతంగా వీయడంతో హఠాత్తుగా వెనాకాల గోడ పడిపోయింది. దీంతో కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు.
పెను ప్రమాదం తప్పింది. కాగా, 2009 వరదల్లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస గృహాలు శిథిలావస్థకు చేరాయని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చారకొండ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మర్రిపల్లిలో బిట్ల ధర్మారెడ్డికి చెందిన ఎకరం వరిపంట నేలకొరిగింది. అలాగే పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు నెలకొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, మాధారం, గుడిగాన్పల్లిలో ఈదురుగాలులతోపాటు వడగండ్లు పడ్డాయి. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అమ్రాబాద్ మండల కేంద్రంలోని జీపీ ఆవరణలో చెట్లు విరిగిపడ్డాయి. కుమ్మరోనిపల్లి సమీపంలో కోళ్లషెడ్డుపై రేకులు ఎగిరిపోయాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లు కరెంట్ తీగలపై విరిగి పడ్డాయి. మల్దకల్ మండలంలోని చిప్పదొడ్డిలో రామన్గౌడ్కు చెందిన ఎద్దులను పొలం వద్ద గుడిసెలో కట్టేసి ఉంచగా.. పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందాయి.
కొల్లాపూర్‌లోని ఇందిరాకాలనీ లో ఈదురుగాలులకు చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అం తరాయం కలిగింది. విద్యుత్ అధికారులు చేరుకొని చెట్ల కొ మ్మలను తొలగించి విద్యుత్ సరఫరా చేశారు. బిజినేపల్లితోపాటు మండలంలో ని పాలెం, ఖానాపూర్, గుడ్లనర్వ, లింగసానిపలి, వెంకటాపూర్, మంగనూర్, మహదేవునిపేట, వసంతాపూర్ తదితర గ్రామా ల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన పెద్దపాటి వ ర్షం కురిసింది. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలకు ఒరగడంతోపాటు, కోసి ఆరబెట్టిన మొక్కజొ న్న, వరి పంటలు నీటిపాలయ్యాయి.
గ్రామాల్లోని ప్రధాన రహదారు లు, ఇం డ్ల మధ్యలో పెద్దచెట్లు విరిగిపడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇ బ్బందులకు గురయ్యారు. రేకుల షెడ్లు, డబ్బాలు ధ్వంసమయ్యాయి. పలు గ్రా మాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తిమ్మాజిపేట మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతతో కూడిన వర్షానికి మామిడి రైతుకు అపార నష్టం వా టిల్లింది. మామిడి కాయాలు నేలరాలాయి. ఆవంచ లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఆవంచ, బుద్దసముద్రంలో రోడ్లపై ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.
ఇప్పలపల్లిలో 220 కేవీ లైన్ తెగిపడిపోందని, ఆర్సీతండా, ఆవంచ, తిమ్మాజిపేటలో 15 విద్యుత్‌స్తంభాలు, 3 సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్ సరఫ రా నిలిచిపోయింది.గోపాల్పేటమండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన మండ్ల విశ్వనాథం, చాకల్‌పల్లికి చెందిన బోయ రాములు ఆదివారం చాకల్‌పల్లి శివారులో మక్క కొయ్యలు మేపేందుకు తమ గొర్రెలను తీసుకెళ్లారు. సాయంత్రం వర్షం ప్రారంభం కావడంతో జీవాలను సమీపంలోని చెట్టు కిందకు తరలించారు. జీవాలున్న ప్రదేశంలో పిడుగు పడడంతో విశ్వనాథంకు చెందిన 22, రాములుకు చెందిన 3జీవాలు మృతిచెందాయి. జీవాల విలువ రూ.3లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందజేయాలని కోరారు.
పెద్దమందడి మండలంలోని జంగమయ్యపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, వీరాయపల్లి, చిన్నమందడిలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కల్లాల వద్ద ఆరబెట్టుకున్న వడ్లు తడిసి ముద్దయ్యా. పామిరెడ్డిపల్లిలో 33కేవీ విద్యుత్ స్తంభం విరిగిపడింది. లారీల్లేక కొనుగోలు కేంద్రాల వద్ద తూకాలు చేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పాన్‌గల్ మండలకేంద్రంతోపాటు బండపల్లి, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి గ్రామాల్లో మామిడి రాలింది. వరి నేలకొరిగింది. తాడూరు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. రేకులషెడ్లు ఎగిరిపోయాయి. పంటలన్నీ నేలకొరిగి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.